వరకట్నం కోసం తిండి పెట్టకుండా పస్తులుంచి... వేధింపులు తట్టుకోలేక...

వరకట్నం కోసం ఐదేళ్లుగా వేధింపులు... ఇద్దరు పిల్లల తల్లికి అన్నం కూడా పెట్టకుండా పస్తులుంచి పైశాచిక ఆనందం... ఎముకల గూడులా మారిన యువతి... కన్నవారినీ కలవనీయకుండా ఇంట్లో నిర్భంధం... వేధింపులు భరించలేక ఆత్మహత్య...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: March 31, 2019, 6:47 PM IST
వరకట్నం కోసం తిండి పెట్టకుండా పస్తులుంచి... వేధింపులు తట్టుకోలేక...
ఇద్దరు పిల్లల తల్లికి తిండి పెట్టకుండా చిత్రహింసలు... అత్తింటివారి వేధింపులు తట్టుకోలేక...
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: March 31, 2019, 6:47 PM IST
వరకట్న దురాచారం గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. 90ల్లో దేశంలోని మహిళలకు శాపంగా ఉన్న వరకట్న దురాచారం ఆ తర్వాత సాంఘిక సంస్కరణల కారణంగా తగ్గుముఖం పడుతూ వచ్చింది. అయితే పూర్తిగా తొలిగిపోలేదు. తాజాగా వరకట్న వేధింపుల కారణంగా ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. కేరళ రాష్ట్రంలో వెలుగుచూసిన ఈ దారుణ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేసింది. కేరళ రాష్ట్రంలోని కొల్లాం ఏరియాకి దగ్గర్లో ఉన్న కరునాగపల్లి గ్రామానికి చెందిన 27 ఏళ్ల తుషార అనే మహిళకు ఐదేళ్ల క్రితం పెళ్లి జరిగింది. వరకట్నంగా ఒప్పుకున్నంత బంగారం ఇచ్చిన తుషార తండ్రి... డబ్బులు మొత్తం ఇవ్వలేకపోయాడు. పది లక్షలు వరకట్నంగా ఇస్తానని ఒప్పుకున్నా... అందులో రూ.2 లక్షలు ఇవ్వడం కుదరలేదు. దాంతో వెల్డింగ్ పని చేసే తుషార భర్త చందూలాల్... అప్పటి నుంచి ఆ డబ్బులు తీసుకురావాల్సిందిగా భార్యను అడుగుతూనే ఉన్నాడు.

భర్తతో పాటు అతని తల్లిదండ్రలు కూడా కోడలిని ఆ డబ్బుల గురించి అడుగుతూ వేధిస్తున్నారు. మొదట్లో బాగానే చూసుకున్న భర్త... కొన్నిరోజుల తర్వాత ఆమెకు అన్నం పెట్టడం మానేశారు. తుషార, చందూలాల్ దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత కూడా తుషారకు అన్నం పెట్టకుండా నానబెట్టిన బియ్యాన్ని పెడుతున్నారు. ఇలా ఉత్త అన్నాన్ని తింటూ వచ్చిన తుషార... చిక్కి శల్యమైపోయింది. శరీరంలో కండ అనేదే లేకుండా 20 కిలోల బరువుతో ఎముకల గూడులా మారిపోయింది. తీవ్ర అనారోగ్యానికి గురైన సరే, కోడలుని పట్టించుకోలేదు ఆ అత్తామామ. కూతుర్ని చూసేందుకు వచ్చిన తండ్రిని కూడా ఆమెను కలవనీయలేదు. మిగిలిన కట్నం తెస్తేనే కూతుర్ని చూపిస్తామని తెగేసి చెప్పారు. తల్లిదండ్రులకు దూరమై, మెట్టింట్లో వేధింపులను ఐదేళ్లుగా మౌనంగా భరిస్తూ వచ్చిన తుషార... ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. అనారోగ్య కారణాల వల్ల ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు తెలిపారు. అయితే తుషార తండ్రి వరకట్నం కోసం వేధించి, ఆమెను చంపేశారని ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదుచేసుుకున్న పోలీసులు... దర్యాప్తు చేయగా ఐదేళ్లుగా అత్తింట్లో తుషార ఎదుర్కొన్న చిత్రహింసలు బయటికి వచ్చాయి. భర్తతో పాటు అత్త, మామ తుషారను మానసికంగా, శారీరకంగా వేధించేవారంటూ పక్కింట్టివాళ్లు సాక్ష్యం చెప్పారు. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు, దర్యాప్తును వేగవంతం చేశారు.
First published: March 31, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...