జైలుకు వెళ్లాలనే కోరికతో... ముసలమ్మను అతి దారుణంగా...

చదువులో టాప్ ర్యాంకర్ అయినా తగిన ఉద్యోగం దొరకక, దొరికిన ఉద్యోగంలో సర్దుకుని ఉండలేక తీవ్ర డిప్రెషన్‌కు గురైన యువకుడు... జైల్లో దర్జాగా ఏ టెన్షన్ లేకుండా బ్రతకవచ్చనే ఉద్దేశంతో 65 ఏళ్ల వృద్ధురాలి దారుణ హత్య...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 21, 2019, 4:42 PM IST
జైలుకు వెళ్లాలనే కోరికతో... ముసలమ్మను అతి దారుణంగా...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కొందరికి వింత వింత కోరికలు ఉంటాయి. అతనికి కూడా అలాంటి వింత కోరికే కలిగింది. బయట పాడు సమాజంలో ఎంత వెతికినా సరైన ఉద్యోగం దొరికక విసిగిపోయిన ఆ యువకుడికి, జైలులో టైమ్‌కి ఫుడ్డు, బెడ్డూ, ఫుల్లు భద్రత ఉన్న సౌకర్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఎలాగైనా జైలుకి వెళ్లి, హాయిగా గడపాలని ఫిక్స్ అయ్యాడు. అంతే కనిపించిన ఓ ముసలమ్మను అతిదారుణంగా పోలీసుల ముందే చంపేశాడు. స్థానికంగా సంచలనం క్రియేట్ చేసిన ఈ సంఘటన కేరళ రాష్ట్రంలోని కోలికోడ్ ఏరియాలో వెలుగుచూసింది. తమిళనాడు రాష్ట్రానికి చెందిన ప్రవీణ్ దాస్ అనే యువకుడు, బతుకుతెరువు కోసం కేరళలోని కోలికోడ్ ఏరియాకు వచ్చాడు. అయితే ఎంత వెతికినా, అతనికి సరైన ఉద్యోగం దొరకలేదు. ఎన్ని ఇంటర్వ్యూలకు వెళ్లిన ఉద్యోగం ఇచ్చిన వాళ్లు లేరు. దాంతో తీవ్రమైన డిప్రెషన్‌కు లోనైన ప్రవీణ్... జైల్లో దర్జాగా బ్రతుకుతున్న ఖైదీల గురించి తెలుసుకున్నారు. కరాగారానికి వెళితే... టైమ్‌కి ఫుడ్డు తింటూ, కంటి నిండి కునుకు తీయవచ్చని ఆలోచించాడు. అంతే... ఏదైనా నేరం చేసి జైలుకి వెళ్లాలని ఫిక్స్ అయ్యాడు. శనివారం ఉదయం ఓ ఇంటర్వ్యూ కోసం ఇంటి నుంచి బయటికి వచ్చిన ప్రవీణ్... ఉద్యోగం రాకపోతే ఎవ్వరినైనా చంపేయాలని ఫిక్స్ అయ్యాడు. ఆలోచన వచ్చిందే తగవుగా మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఓ కత్తి కొనుగోలు చేశాడు.

ఇంటర్వ్యూ కోసం బయలుదేరిన ప్రవీణ్... కమీషనర్ ఆఫీసర్ ముందు ఓ ముసలమ్మను చూసి ఆగిపోయాడు. కమీషనర్‌‌ను కలిసి ఏదో వినతి ఇచ్చేందుకు వచ్చిన 65 ఏళ్ల ముసలమ్మను చూసి ఆగిన ప్రవీణ్‌కు, అప్పుడే పోలీస్ కమీషనర్ బయటికి రావడం కనిపించింది. ఇదే సరైన సమయమని భావించి, ముసలమ్మను కత్తితో పొడిచేశాడు. దారుణంగా దాడి చేసి, ముసలమ్మను హత్య చేసి, కమీషనర్ ఆఫీస్ గేటుపైన పడేశాడు. ఈ సంఘటనను కళ్లారా చూసిన పోలీస్ అధికారులు, షాక్ తిని వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. వృద్ధురాలిని ఎందుకు హత్య చేశావు? అని పోలీసులు నిలదీయడంతో అసలు విషయం చెప్పాడు. జైలుకు వెళ్లి సుఖపడేందుకే హత్య చేశానంటూ ప్రవీణ్ చెప్పిన సమాధానం విని, పోలీసులు ఖంగుతిన్నారు. చదువులో టాప్ ర్యాంకర్ అయిన ప్రవీణ్... గల్ఫ్ దేశంలో కొద్దికాలం పనిచేసి, ఇండియాకు తిరిగి వచ్చాడని, ఆ తర్వాత కొన్నాళ్లు బెంగళూరులో కూడా ఉద్యోగం చేశాడని తెలిపారు అతని కుటుంబసభ్యులు. చదువుకి తగిన ఉద్యోగం దొరకక, దొరికిన ఉద్యోగంలో సర్దుకుని ఉండలేక తీవ్ర డిప్రెషన్‌కు గురై, మానసికంగా చితికిపోయాడని తెలిపారు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు... ప్రవీణ్‌ను అదుపులోకి తీసుకుని, మానసిక వైద్యశాలలో పరీక్షలు చేయిస్తున్నారు.
First published: April 21, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading