16 ఏళ్ల కుర్రాడిపై అత్యాచారయత్నం... అబ్బాయిపై రేప్ అటెప్ట్ చేసిన యువకుడు...

కూలీపనికి వచ్చిన బాలుడిపై ఎలక్ట్రిషన్ అత్యాచారయత్నం... సమయానికి గుర్తించి, పిల్లాడిని కాపాడిన కుటుంబసభ్యులు...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: May 1, 2019, 7:29 PM IST
16 ఏళ్ల కుర్రాడిపై అత్యాచారయత్నం... అబ్బాయిపై రేప్ అటెప్ట్ చేసిన యువకుడు...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
స్వాతంత్య్ర భారతంలో ఆడపిల్లలకే కాదు...మగ పిల్లలకు కూడా రక్షణ లేకుండా పోయిందని నిరూపించే భయానక సంఘటన ఇది. ఒంటరిగా దొరికితే చాలు, ఆడ అయినా మగ అయినా పర్లేదు... అత్యాచారానికి పాల్పడుతున్నారు కొందరు ప్రబుద్ధులు. స్థానికంగా సంచలనం క్రియేట్ చేసిన ఈ సంఘటన కేరళ రాష్ట్రంలోని మలప్పురం జిల్లాలో వెలుగుచూసింది. పలక్కడ్ ఏరియాకు సమీపంలో ఉన్న ఓ ఏరియాలో కూలీ పనులకు వెళ్లాడో 16 ఏళ్ల బాలుడు. పదో తరగతి పరీక్షలు పూర్తి చేసిన సదరు యువకుడు, కుటుంబ ఆర్థిక పరిస్థితులు సరిగా లేని కారణంగా హాలీడేస్‌లో కూలీపనులు చేయడానికి వచ్చాడు. అయితే బాలుడు పనిచేసే ఏరియాలోనే ఎలక్ట్రిషన్‌గా పనిచేస్తున్న నారాయణన్ అనే వ్యక్తి... బాలుడిపై కన్నేశాడు. పని ఉందని చెప్పి, కుర్రాడిని ఓ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడ బాలుడిపై అత్యాచారానికి యత్నించాడు. ఎలక్ట్రిషన్‌తో వెళ్లిన కొడుకు... ఎంతకీ తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చిన బాలుడి తల్లిదండ్రులు, వెతుకుతూ వెళ్లాడు. బాలుడిపై అఘాయిత్యానికి ప్రయత్నిస్తున్న నారాయణన్‌ చూసి... షాకై అతనిపై దాడి చేశాడు.

ఇళ్లు నిర్మించేందుకు ఉపయోగించే ఇనుప కడ్డీలతో నారాయణన్‌పై దాడి చేసి, కుర్రాడిని రక్షించారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు... బాలుడి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎలక్ట్రిషన్ నారాయణన్ అదుపులోకి తీసుకున్నారు. బాలుడిపై అత్యాచారానికి ఒడిగట్టిన నారాయణన్ మానసిక పరిస్థితి సరిగా ఉండేది కాదని కొందరు వాదిస్తుంటే, బాలుడి కుటుంబసభ్యులు మాత్రం అతన్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. నారాయణన్‌పై పోస్కో యాక్ట్ ప్రకారం కేసు నమోదుచేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.

First published: May 1, 2019, 7:29 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading