కన్నతండ్రి గొంతుకు వైర్ చుట్టి, సుత్తితో కొట్టి చంపిన కొడుకు... మద్యం మత్తులో ...

ఆస్తి పంపకాల విషయంలో తండ్రితో గొడవ... తాగి వచ్చి గొంతుకు వైర్‌ను చుట్టి... రొకలి, సుత్తితో తలపై కొట్టి దారుణ హత్య...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: March 29, 2019, 8:33 PM IST
కన్నతండ్రి గొంతుకు వైర్ చుట్టి, సుత్తితో కొట్టి చంపిన కొడుకు... మద్యం మత్తులో ...
కన్నతండ్రిని సుత్తితో కొట్టి చంపిన కొడుకు... మద్యం మత్తులో దారుణం...
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: March 29, 2019, 8:33 PM IST
మద్యం మత్తు ఏం చేయిస్తుందో చెప్పలేం. తాగిన మత్తులో కన్నతండ్రినే చంపేశాడో కిరాతక కొడుకు. స్థానికంగా సంచలనం క్రియేట్ చేసిన ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలో వెలుగుచూసింది. కర్ణాటక రాష్ట్రం మాలూరు తాలూకాలో ఉన్న బంటహళ్లి గ్రామంలో నివాసం ఉంటున్న 70 ఏళ్ల రామచంద్రప్పకు నలుగురు కొడుకులు, నలుగురు కూతుళ్లు ఉన్నారు. అందరికీ పెళ్లిళ్లు అయిపోయి, వేరు కాపురాలు కూడా పెట్టారు. మూడో కొడుకు మంజునాథ్, బెంగళూరు సిటీలోని మారతహళ్లి ఏరియాలో హెయిర్ కట్టింగ్ షాప్ పెట్టుకుని, జీవించేవాడు. అయితే అది సరిగ్గా నడవకపోవడంతో దాన్ని మూసేసి, నాలుగు నెలల క్రితం స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. స్వగ్రామానికి తిరిగి వచ్చిన తర్వాత చేయడానికి పని లేకపోవడంతో తాగుడికి బానిసయ్యాడు. నిత్యం తాగి వచ్చి, ఇంట్లో ఒంటరిగా ఉంటున్న తండ్రితో గొడవపడేవాడు.

బుధవారం రాత్రి కూడా ఫుల్లుగా తాగి వచ్చిన మంజునాథ్, తండ్రితో గొడవకు దిగాడు. మిగిలిన కొడుకులకు ఆస్తి పంచి ఇచ్చి, తనకు మాత్రం అన్యాయం చేశావంటూ తండ్రిని కొట్టడం మొదలెట్టాడు. కొడుకు దాడిలో కిందపడిపోయిన రామచంద్రప్ప గొంతుకు వైర్‌ను చుట్టి... రొకలి, సుత్తి తీసుకుని అతి దారుణంగా తలపై కొట్టి హత్య చేశారు. ఆ సమయంలో ఇంట్లో ఎవ్వరూ లేకపోవడం, వృద్ధుడు పెద్దగా అరవలేకపోవడంతో జరిగిన దారుణాన్ని ఎవ్వరూ ఆపలేకపోయారు. తండ్రిని చంపిన తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు మంజునాథ్. వృద్ధుడు చనిపోయి పడి ఉండడాన్ని గమనించిన పక్కింటి వ్యక్తి, పోలీసులకు సమాచారం అందించాడు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు... మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్ నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. 5 గంటల్లో తండ్రిని చంపిన మంజునాథ్‌ను అరెస్ట్ చేశారు.
First published: March 29, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...