ప్రియుడితో కలిసి కాబోయే భర్తను అతిదారుణంగా... ఫేస్‌బుక్ ఫ్రెండ్‌తో ప్రేమ...

కాబోయే భర్తకు జ్యూస్‌లో మత్తుమందు కలిపి ఇచ్చిన యువతి... ఏకాంతంగా మాట్లాడుకుందామని బయటికి తీసుకెళ్లి, ప్రియుడితో కలిసి...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: May 31, 2019, 8:30 PM IST
ప్రియుడితో కలిసి కాబోయే భర్తను అతిదారుణంగా... ఫేస్‌బుక్ ఫ్రెండ్‌తో ప్రేమ...
ఫేస్‌బుక్ ఫ్రెండ్‌తో ప్రేమ... ప్రియుడితో కలిసి కాబోయే భర్తపై దాడి చేసిన యువతి...
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: May 31, 2019, 8:30 PM IST
ఫేస్‌బుక్‌లో పరిచయమైన వ్యక్తితో ప్రేమాయణం నడిపిన ఓ యువతి... కాబోయే భర్తను అతనితో కొట్టించింది. కాబోయే భార్యను చూసేందుకు వెళితే తనపై దాడి చేసింది ఎవరో తెలియక తికమకపడిన సదరు యువకుడు... దాడి వెనక ఉన్న ఫేస్‌బుక్ ప్రేమాయణం తెలిసి అవాక్కయ్యాడు. కర్ణాటక రాష్ట్రంలోని హోసూరు ఏరియాలో జరిగిన ఈ సంఘటన... సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఉత్తేంగేరి సమీపంలోని గొల్లనూరు గ్రామానికి చెందిన 27 ఏళ్ల శరవణన్... ఓ ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. శరవణన్ బంధువుల ద్వారా చెన్నప్పనాయకనూరు గ్రామానికి చెందిన జాన్సీరాణితో పెళ్లి నిశ్చయం జరిగింది. నిశ్చితార్థం అయిన తర్వాత జాన్సీరాణితో సాన్నిహిత్యం పెంచుకునేందుకు తెగ ప్రయత్నిస్తూ వస్తున్న శరవణన్... గత ఆదివారం ఆమెను చూసేందుకు చెన్నప్పనాయకనూరుకి వెళ్లాడు. తన కోసం వచ్చిన కాబోయే భర్తకు జ్యూస్‌లో మత్తుమందు కలిపి ఇచ్చిన జాన్సీరాని... ఏకాంతంగా మాట్లాడాలని చెప్పి బయటికి తీసుకెళ్లింది. కాబోయే భార్య పిలవడంతో ఎంతో హుషారుగా బయటికి వెళ్లాడు శరవణన్.

బయటికి వెళ్లిన కాసేపటికి మత్తు మందు ప్రభావంతో స్పృహ తప్పి పడిపోయాడు. ఆ వెంటనే జాన్సీరాణి... తన ఫేస్‌బుక్ ప్రియుడు కార్తీక్‌కు ఫోన్ చేసి సమాచారం అందించింది. ప్రియురాలి పిలుపుతో వెంటనే అక్కడికి వచ్చిన కార్తీక్, తన స్నేహితులు నలుగురితో కలిసి మత్తులో పడి ఉన్న శరవణన్‌ను దాడి చేసి తీవ్ర కొట్టారు. తర్వాత రక్తపు మడుగులో పడి ఉన్న శరవణన్‌ను రోడ్డు పక్కన పడేసి వెళ్లిపోయారు. శరవణన్‌ను గమనించిన స్థానికులు... వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు... దర్యాప్తు చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ప్రియుడితో కలిసి కాబోయే భర్తపై దాడి చేయించిన జాన్సీరాణిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఆమె ప్రియుడు, అతని స్నేహితుల కోసం గాలిస్తున్నారు.


First published: May 31, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...