12 వేల మందితో సెక్స్... 70 ఏళ్ల ముసలమ్మతో సహా... వీడు మనిషేనా...

లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న హెడ్మాస్టర్ దగ్గర 400 ఆల్బమ్స్‌లు, దాదాపు లక్షన్నర ఫోటోలు... తాను అనుభవించిన మహిళల, బాలికల ఫోటోలను తీసి భద్రపర్చుకున్న ప్రధానోపాధ్యాయుడు...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 17, 2019, 8:30 PM IST
12 వేల మందితో సెక్స్... 70 ఏళ్ల ముసలమ్మతో సహా... వీడు మనిషేనా...
రాయబార కార్యాలయం బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... ల్యాప్‌టాప్‌కు కనెక్ట్ చేసి...
  • Share this:
మామూలుగా అయితే కోరికలు ఎక్కువగా ఉన్న ఓ మనిషి తన సగటు జీవితంలో మహా అయితే వంద మందితో శృంగారంలో పాల్గొంటాడేమో. మరీ ఎక్కువగా డబ్బున్న వాడైతే ఆ సంఖ్య బీభత్సంగా పెరిగినా ఇంకో సున్నా పెరగొచ్చు. కానీ వెయ్యి, రెండో వేల మందో కాదు... ఏకంగా 12 వేల మందితో శారీరక సుఖాన్ని అనుభవించాడో 65 ఏళ్ల వ్యక్తి. 12 ఏళ్ల వయసున్న బాలికల దగ్గర్నుంచి 72 ఏల్ల ముసలమ్మల దాకా అందరితోనూ ఆ పని కానిచ్చాడు. దాదాపు 27 ఏళ్ల తర్వాత అతను చేస్తున్న అఘాయిత్యాలు బయటికి రావడంతో ఈ ప్రబుద్ధుడి గురించి ప్రపంచానికి తెలిసింది. ఇంతకీ అంతనేం చేస్తుంటాడో తెలుసా... ఓ స్కూల్ హెడ్మాస్టర్. జపాన్‌లోని టోక్నోకి సమీపంలో ఉండే తకషిమా అనే స్కూల్ ప్రధానోపాధ్యాయుడిపై బాలికల పోర్న్ ఫోటోలు ఉన్నాయనే కేసు నమోదైంది. దానితో పాటు స్కూళ్లో చదువుకోవడానికి వచ్చే బాలికల ఆర్థిక పరిస్థితి అడ్డం పెట్టుకుని, వారిని శారీరకంగా లొంగదీసుకుంటున్నాడనేది తకషిమాపైన ఉన్న మరో అభియోగం. కేసు నమోదుచేసుకున్న పోలీసులు... దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో పోలీసులతో పాటు సభ్య సమాజం విస్తుపోయే నిజాలెన్నో బయటికి వచ్చాయి.

1988లో స్కూల్‌కు ఉపాధ్యాయుడిగా వచ్చిన తకషీమా... అపపటి నుంచి అమ్మాయిలతో, యువతులతో, మహిళలతో శారీరక సంబంధం పెట్టుకోవడం అలవాటు చేసుకున్నాడు. తనకు వచ్చే జీతాన్ని మొత్తం యువతులతో అనుభవించేందుకే ఖర్చు పెట్టేవాడు. ఇలా తాను కోరిక తీర్చుకున్న ప్రతీ యువతి ఫోటో తీసుకుని భద్రపరిచేవాడు. ఇలా 27 ఏళ్ల కాలంలో అతని దగ్గర 400 ఆల్బమ్స్‌లు, దాదాపు లక్షన్నర ఫోటోలు పోగొయ్యాయి. అవన్నీ లెక్కేయగా తకషీమా అనుభవించిన మహిళల సంఖ్య 12 వేలకు పైనే అని తేలింది. నచ్చిన అమ్మాయిలను వెతుక్కుంటూ తకషీమా 65 దేశాలు తిరిగడం మరో విశేషం. వీరిలో దాదాపు 10 శాతం మంది అంటే 1200 మంది 12 నుంచి 16 ఏళ్ల లోపు ఉన్న బాలికలు. తన పాఠాలు బోధించే పాఠశాలలో ఉన్న విద్యార్థుల ఆర్థిక కష్టాలను తెలుసుకుని, వారిని తీర్చేవాడు. ప్రతిఫలంగా తన కోరిక తీర్చమని కోరేవాడు. దాదాపు రెండేళ్ల క్రితం జపాన్ దేశంలో వెలుగుచూసిన ఈ హెడ్మాస్టర్ రాసలీలల ఉదంతం... ఆ దేశంలో సంచలనం క్రియేట్ చేశాయి. అయితే తాజాగా తకషీమాను విచారణ పూర్తి చేసిన యోకోహామా జిల్లా కోర్టు అతనికి కేవలం రెండేళ్ల జైలు శిక్ష మాత్రమే విధించింది. ఆర్థిక అవసరాలను తీర్చి, శారీరక సుఖాన్ని అనుభవించాడు, కానీ ఎవ్వరినీ బలవంతం చేయలేదని... తకషీమాపై సానుభూతి చూపించి, తక్కువ శిక్షతో సరిపెట్టింది కోర్టు.

First published: April 17, 2019, 8:30 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading