Vanasthalipuram Sisters Kidnap Case: హైదరాబాద్ లో షాకింగ్ ఘటన.. ముగ్గురు అక్కాచెల్లెళ్లు అదృశ్యం.. రాత్రి నిద్రపోయేందుకు గదిలోకి వెళ్లి..

ప్రతీకాత్మక చిత్రం

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బాలికలు శనివారం ఉదయం నుంచి కనిపించకుండా పోయారు. వాళ్లు అదృశ్యం అవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.

  • Share this:
    హైదరాబాద్ లో ఓ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బాలికలు శనివారం ఉదయం నుంచి కనిపించకుండా పోయారు. వాళ్లు అదృశ్యం అవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే వీళ్ల మిస్సింగ్ వ్యవహారం వెనుక పెద్ద కుమార్తె ప్రేమ వ్యవహారమే కారణమయి ఉంటుందని కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. కొందరిపై అనుమానం ఉన్నట్టు పేర్లను కూడా పోలీసులకు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ లోని వనస్థలిపురం పరిధిలోని ప్రగతీ నగర్ కు చెందిన ఓ కుటుంబంలో ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఉన్నారు. 17 ఏళ్ల వయసున్న ఐశ్వర్య, 15 ఏళ్ల వయసున్న ఆస్మా, 14 ఏళ్ల వయసున్న అబీర్ లను కుటుంబ సభ్యులు అత్యంత గారాబంగా పెంచారు.

    అయితే శనివారం తెల్లవారుజాము నుంచి వాళ్లు ముగ్గురూ ఇంట్లో కనిపించకుండా పోయారు. రాత్రి నిద్రపోయేందుకు తమ గదుల్లోకి వెళ్లిన ఆ ముగ్గురు అక్కాచెల్లెళ్లను నిద్ర లేపేందుకు తల్లి వెళ్లింది. కానీ తీరా చూస్తే గదిలో వాళ్లు కనిపించలేదు. చుట్టుపక్కల వెతికినా, బంధువులను ఆరా తీసినా లాభం లేకుండా పోయింది. దీంతో వనస్థలి పురం పోలీసులకు ఆ ముగ్గురు మైనర్ బాలికల తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. కాగా, ఆ ముగ్గురు మైనర్ బాలికల అదృశ్యానికి పెద్దమ్మాయి ఐశ్వర్య ప్రేమ వ్యవహారమే కారణమయి ఉంటుందని అంతా అనుమానిస్తున్నారు.
    ఇది కూడా చదవండి: అమెరికాలో ఘోరం.. నట్టింట్లో రక్తపు మడుగులో భారతీయ భార్యాభర్తలు.. నాలుగేళ్ల కూతురు బాల్కనీలోకి వెళ్లి..

    ఐశ్వర్య ప్రేమ వ్యవహారం గురించే శుక్రవారం రాత్రి తల్లి ఆ ముగ్గురు అక్కాచెల్లెళ్లపై కోపపడింది. పద్ధతిగా నడుచుకోవాలనీ, కుటుంబానికి చెడ్డపేరు తేవొద్దని హెచ్చరించింది. ప్రగతి నగర్ కు చెందిన రమేష్ అనే కుర్రాడు ఐశ్వర్యను ప్రేమిస్తున్నానంటూ వేధిస్తున్నాడు. దీంతో అతడిని ఐశ్వర్య తల్లిదండ్రులు పలుమార్లు హెచ్చరించారు. మరోసారి కూతురి జోలికి వస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని కూడా బెదిరించారు. తమ కూతుళ్ల అదృశ్యానికి రమేషే కారణమయి ఉంటాడని తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు. తన స్నేహితులతో కలిసి తమ కూతుళ్లను రమేషే కిడ్నాప్ చేయించి ఉంటాడని వాపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
    ఇది కూడా చదవండి: ప్రియుడితో తల్లి ఎస్కేప్.. తండ్రి బాధను చూడలేక.. పదేళ్ల తర్వాత కన్న కొడుకే పనోడిలా చేరి ఇలా పగతీర్చుకున్నాడు..!
    Published by:Hasaan Kandula
    First published: