హైదరాబాద్‌లో దారుణం... అడ్రెస్ గురించి గొడవ, యువకుడి ప్రాణం తీసింది...

అడ్రెస్ గురించి మొదలైన చిన్న గొడవ... గ్యాంగ్ వార్‌గా మారి, ఇద్దరిపై మూకుమ్మడి దాడి... యువకుడిని చితక్కొట్టి, రాళ్లపై పడేసిన లోకల్ గ్యాంగ్...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: March 29, 2019, 3:46 PM IST
హైదరాబాద్‌లో దారుణం... అడ్రెస్ గురించి గొడవ, యువకుడి ప్రాణం తీసింది...
హైదరాబాద్‌లో దారుణం... అడ్రెస్ గురించి గొడవ, యువకుడి ప్రాణం తీసింది...
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: March 29, 2019, 3:46 PM IST
హైదరాబాద్‌లో అడ్రెస్ వెతికి పట్టుకోవడం అంటే అంత ఆషామాషీ కాదు. చాలా సినిమాల్లో భాగ్యనగర వీధుల గురించి చాలా సెటైర్లు కూడా వేశారు. తాజాగా ఓ అడ్రెస్ కారణంగా మొదలైన చిన్న గొడవ... ఓవ యువకుడి ప్రాణాలు తీసింది. రాజేంద్రనగర్ ఏరియాలో జరిగిన ఈ సంఘటన... స్థానికంగా కలకలం క్రియేట్ చేసింది. హైదరాబాద్‌లోని ఎంఎం పహాడీ ఏరియాకు చెందిన 25 ఏళ్ల నదీమ్, అతని స్నేహితుడు రహీద్ కలిసి బంధువల ఇంట్లో డిన్నర్‌ చేసి, మరో స్నేహితుడు జాబేర్‌ను కలిసేందుకు వెళ్తున్నారు. అయితే జాబేర్ ఇళ్లు ఎక్కడో సరిగ్గా తెలియకపోవడంతో ఓ దగ్గర కూర్చున్న యువకులను అడ్రెస్ అడిగారు. అయితే దానికి ఆ యువకుల నుంచి సమాధానానికి బదులుగా కౌంటర్ రావడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. చిన్నగొడవ కాస్తా పెరిగి దాడులు చేసుకున్నారు. దాంతో లోకల్ యువకుడైన జాకీర్, తన స్నేహితులకు ఫోన్ చేసి సమాచారం అందించారు.

తనను కొడుతున్నారని, వెంటనే మనవాళ్లను తీసుకుని రావాలంటూ సమాచారం ఇచ్చాడు. స్నేహితుడి నుంచి ఫోన్ రాగానే ఆరుగురు యువకులు హాకీ స్టిక్స్, బ్యాట్స్ పట్టుకుని అక్కడికి చేరుకున్నారు. కొందరు కత్తులు కూడా తీసుకుని రావడం విశేషం. గొడవ పెద్దగా అవుతుండడంతో స్థానికులు, వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే వారి మాటలను పట్టించుకోని యువకులు... నదీమ్, రహీమ్‌పై దాడి చేశారు. హాకీ స్టిక్స్‌తో కొడుతూ, ఇద్దరినీ చితకబాదారు. ఈ దాడిలో కిందపడిన నదీమ్‌ను ఎత్తి, పక్కనే ఉన్న గనైట్ రాళ్లప పడేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. రక్తపు మడుగుల్లో పడి ఉన్న ఇద్దరినీ గమనించిన స్థానికులు... పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు... యువకులను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. రాళ్లపై పడేయడంతో తలకు తీవ్ర గాయమైన నదీమ్... చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. అతనిపై దాడి చేసిన యువకుల కోసం గాలిస్తున్న పోలీసులు... సెన్సిటివ్ ఏరియా కావడంతో ఎలాంటి అల్లర్లు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.First published: March 29, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...