ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం, ఆపై హత్య... మద్యం తాగి హోళీ ఆడేందుకు వచ్చి...

ఇంటి ముందు హోళీ ఆడుకుంటున్న ఆరేళ్ల చిన్నారి కిడ్నాప్... ఆ తర్వాత పొదల్లో శవమై కనిపించిన బాలిక... పోస్ట్‌మార్టమ్ నివేదికలో బాలికపై హత్యాచారం జరిగినట్టు నిర్ధారణ... 24 గంటల్లో కేసును చేధించిన హైదరాబాద్ పోలీసులు...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: March 22, 2019, 8:00 PM IST
ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం, ఆపై హత్య... మద్యం తాగి హోళీ ఆడేందుకు వచ్చి...
హైదరాబాద్‌లో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి హత్య (నమూనా చిత్రం)
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: March 22, 2019, 8:00 PM IST
హైదరాబాద్ మహానగరంలో మరో దారుణం వెలుగుచూసింది. ఆరేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసి, ఆత్యాచారం చేసిన దుండుగులు హత్య చేసి పడేశారు. ఇన్నాళ్లు ఎక్కడోలే ఇక్కడ కాదు కదా... అని ప్రశాంతంగా నిద్రపోతున్న నగరాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురిచేసిందీ దారుణ సంఘటన. అత్యాచారం అంటే కూడా ఎరుగని పసికందు ప్రాణాలు తీశారు కొందరు మృగాళ్లు. మెదక్ జిల్లాకు చెందిన చంద్రయ్య, కృష్ణవేణి దంపతులు... కొన్నేళ్ల క్రితం బతుకుతెరువు కోసం నగరానికి వలస వచ్చారు. మేడ్చల్ జిల్లాలోని తుర్కపల్లి ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. గురువారం మధ్యాహ్నం హోళీ రోజున ఇంటి ముందు ఆడుకుంటున్న ఆరేళ్ల చిన్నారి ఒక్కసారిగా కనిపించకుండాపోయింది. బాలిక కోసం తల్లిదండ్రులు ఎంతవెతికానా ప్రయోజనం లేకపోయింది. బాలిక కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆమె తల్లిదండ్రులు. రాత్రి 12 గంటల సమయంలో కృష్ణానగర్ ఏరియాలో ఉన్న పొదల్లో బాలిక శవమై కనిపించింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు... బాలిక మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్ నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బాలికపై అత్యాచారం చేసిన దుండగులు... గొంతునులిమి చంపినట్టు తేలింది.

కేసు నమోదుచేసుకున్న పోలీసులు...చిన్నారి ఇంటిపక్కనే ఉంటున్న బీహార్‌కు చెందిన ఆరుగురు యువకులపై అనుమానం వ్యక్తం చేశారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. బీహార్‌కు చెదిన ధర్మేంద్ర దగ్గరికి కొందరు యువకులు హోళీ ఆడేందుకు వచ్చారు. ఫుల్లుగా మద్యం సేవించి వచ్చిన వీళ్లు... అక్కడే ఆడుకుంటున్న బాలికపై కన్నేశారు. బాలికతో ఉన్న సోదరుడికి రంగులు కొన్నిచ్చిన రాజేశ్ కుమార్ అనే యువకుడు... మధ్యాహ్నం మూడు, నాలుగు గంటల సమయంలో చిన్నారిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడు. అక్కడి నుంచి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి, బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. తర్వాత గొంతు నులిమి చంపేశాడు. బాలిక శవాన్ని పొదల్లో పడేసి... ఏమీ ఎరగనట్టుగా తన గదికి వెళ్లిపోయాడు. చిన్నారిపై జరిగిన హత్యాచారానికి నిరసనగా గ్రామస్థులు ర్యాలీ తీశారు. డాగ్ స్వ్కాడ్ సహాయంతో 24 గంటల్లోనే చిన్నారి హత్యాచారం కేసును చేధించారు పోలీసులు. మనుషుల్లో మృగాళ్ల సంఖ్య పెరిగిపోయిందని, చిన్నారుల బయట ఉన్నప్పుడు ఓ కంటకనిపెట్టుకుని ఉండాలని తల్లిదండ్రులకు సూచిస్తున్నారు పోలీసులు.
First published: March 22, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...