హైదరాబాద్‌లో దారుణం... మంత్రాల పేరుతో యువతిపై అత్యాచారం

దంపతుల అనుమానాన్ని అవకాశం మార్చుకున్న ఓ భూతవైద్యుడు... వారి కూతురిపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది.

news18-telugu
Updated: June 15, 2019, 11:53 AM IST
హైదరాబాద్‌లో దారుణం... మంత్రాల పేరుతో యువతిపై అత్యాచారం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
టెక్నాలజీ ఎంతగా పెరుగుతున్నా... ప్రజల్లో మాత్రం ఇంకా మూఢవిశ్వాసాలపై నమ్మకం పోవడం లేదు. ఈ కారణంగానే కొందరు మోసగాళ్లు మంత్రాల పేరుతో అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు అసాంఘిక కార్యకలాపాలకు కూడా పాల్పడుతున్నారు. హైదరాబాద్‌లోని ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. ఇంట్లో దెయ్యం ఉందని... దాన్ని తన మంత్రాలతో తరిమేస్తానని నమ్మించిన ఓ భూత వైద్యుడు యువతిని బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. బోరబండకు చెందిన దంపతుల అనుమానాన్ని ఆసరాగా చేసుకున్న మోసగాడు ఈ దారుణానికి పాల్పడ్డాడు.

తమ ఇంట్లో తరచూ గొడవలు జరుగుతుండటం, పలు సమస్యలు వస్తుండటంతో కొన్ని వారాల క్రితం మల్లేపల్లికి చెందిన భూతవైద్యుడు ఆజంను కలిశారు ఆ దంపతులు. వారు చెప్పింది విన్న ఆజం ఇంట్లో దెయ్యం ఉందని, దాని వల్లే చెడు జరుగుతోందని వారిని నమ్మించాడు. దానిని ఇంట్లోంచి వెళ్లగొడితే అంతా మంచే జరుగుతుందని వివరించాడు. ఇందుకోసం వారిని నుంచి సార్లు పొరుగు రాష్ట్రంలో ఉన్న ఓ వర్గాకు తీసుకెళ్లాడని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే దంపతుల కుమార్తెపై కన్నేసిన ఆజం... తనను పెళ్లి చేసుకోకుంటే నీ తల్లిదండ్రులు చనిపోతారని ఆమెను బెదిరించాడు. ఈ క్రమంలోనే కొద్ది రోజలు క్రితం దంపతుల ఇంటికి వచ్చిన వారి కుమార్తెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగుతున్నారు.
Published by: Kishore Akkaladevi
First published: June 15, 2019, 11:52 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading