హైదరాబాద్‌లో దారుణం... కన్నకొడుకునే హత్య చేయించిన తల్లిదండ్రులు...

చిన్నకొడుకు చేత పెద్దకొడుకును చంపించిన తల్లిదండ్రులు... హత్య చేసిన తర్వాత ఏమీ తెలియనట్టుగా మిస్సింగ్ కేసు... మేడ్చెల్ జవహార్‌నగర్ ఏరియాలో వెలుగుచూసిన దారుణం...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: May 16, 2019, 3:32 PM IST
హైదరాబాద్‌లో దారుణం... కన్నకొడుకునే హత్య చేయించిన తల్లిదండ్రులు...
హైదరాబాద్‌లో దారుణం... కన్నకొడుకునే హత్య చేయించిన తల్లిదండ్రులు...
  • Share this:
బిడ్డకు చిన్న దెబ్బ తగిలితేనే తట్టుకోలేక విలవిలలాడిపోతారు తల్లిదండ్రులు. తాము తిన్నా, తినకపోయినా కన్నబిడ్డ కడుపు నిండితే సంతోషంతో ఉప్పొంగిపోతారు. అలాంటి తల్లిదండ్రులే కన్నకొడుకును చంపేయమని చెప్పారంటే.. వాళ్లు ఎంత నరకయాతన అనుభవించారో అర్థం చేసుకోవచ్చు. స్థానికంగా సంచలనం క్రియేట్ చేసిన ఈ సంఘటన తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరశివారులో వెలుగుచూసింది. మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లాలో కాప్రా మండలంలోని వంపుగూడకాలనీలో శ్రీనివాస్, మణెమ్మ దంపులకు ఇద్దరు కొడుకులు, ఓ కుమార్తె ఉన్నారు. శ్రీనివాస్, అతని భార్య కాప్రా మున్సిపాలిటీలో కాంట్రెక్ట్ కూలీలుగా పనిచేస్తున్నారు. వీరి పెద్ద కుమారుడు 24 ఏళ్ల సాయికుమార్... చదువు మధ్యలోనే ఆపేసి పెయింటర్‌‌గా పనిచేస్తున్నాడు. తాగుడుకి బానిసైన సాయికుమార్... రోజూ తాగి వచ్చి తల్లిదండ్రులతో గొడవ పడేవాడు. ఎన్నిసార్లు చెప్పినా వినకుండా, తల్లిదండ్రులను పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహారించేవాడు. పెద్దకొడుకు వేధింపులను మౌనంగా భరిస్తూ వచ్చిన శ్రీనివాస్, మణెమ్మ... ఈ మధ్య అతని వేధింపులు ఎక్కువ కావడంతో తట్టుకోలేకపోయారు. తాము ప్రశాంతంగా బ్రతకాలంటే సాయికుమార్‌ను చంపేయడమే కరెక్ట్ అని ఫిక్స్ అయ్యారు. పెద్ద కొడుకుని చంపేయమని చిన్నకొడుకుకి చెప్పారు.

ఏప్రిల్ 25న తల్లిదండ్రుల పెళ్లిరోజు కావడంతో వారి కూతురు పుట్టింటికి వచ్చి వెళ్లింది. అదే సమయంలో ఫుల్లుగా తాగి వచ్చిన సాయికుమార్... కుటుంబసభ్యులతో గొడవ పడ్డాడు. తల్లిని కొట్టి, తండ్రిని బండబూతులు తిట్టి వెళ్లిపోయాడు. రాత్రి ఇంటికి వచ్చి విషయం తెలుసుకున్న సాయికుమార్ తమ్ముడు సందీప్... స్నేహితులతో కలిసి అన్నను చంపేందుకు పథకం పన్నాడు. సాయికుమార్‌ను చంపితే అడిగినంత డబ్బు ఇస్తామని సందీప్‌, అతని స్నేహితులు ఇబ్రహీం, జి సందీప్, ఫయాజ్‌లతో తల్లిదండ్రులు చెప్పడంతో వారు పక్కా స్కెచ్ వేశారు. అర్ధరాత్రి సమయంలో పార్టీ ఉందని చెప్పి సాయికుమార్‌ను ఇంటి నుంచి బయటికి తీసుకెళ్లారు సందీప్, అతని స్నేహితులు. వంపుగూడ పరిధిలోని ఓ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి ఫుల్లుగా తాగించి, మద్యం మత్తులో పడిపోయిన తర్వాత రాళ్లతో అతిదారుణంగా కొట్టారు. రక్తపు మడుగులో పడిపోయిన సాయికుమార్‌ను బీరు సీసాతో గొంతు కోసి చంపేశారు. తర్వాత అక్కడే గొయ్యి తీసి పూడ్చిపెట్టి వచ్చారు. ఏమీ తెలియనట్టుగా కొడుకు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదుచేశారు శ్రీనివాస్ దంపతులు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు... సాయికుమార్ కోసం గాలింపు చర్యలు మొదలెట్టారు. 11న గుర్తుతెలియని వ్యక్తి పుర్రె, ఎముకలను గుర్తించిన స్థానికులు... పోలీసులకు ఫిర్యాదుచేశారు. సాయం కోసం స్థానిక నాయకుడికి హత్య చేసిన విషయం మొత్తం వివరించాడు సందీప్. అతను పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
First published: May 16, 2019, 3:32 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading