హైదరాబాద్‌లో దారుణం... 12 ఏళ్ల కూతురిపై తండ్రి అఘాయిత్యం... గదిలో నగ్నంగా...

హైదరాబాద్ మల్కాజిగిరి ఏరియాలో వెలుగుచూసిన దారుణం... 12 ఏళ్ల కూతురితో నీచంగా ప్రవర్తిస్తూ భార్యకు దొరికిపోయిన తండ్రి... నిందితుడి అరెస్ట్...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: May 25, 2019, 7:51 PM IST
హైదరాబాద్‌లో దారుణం... 12 ఏళ్ల కూతురిపై తండ్రి అఘాయిత్యం... గదిలో నగ్నంగా...
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
హైదరాబాద్ మహానగరంలో దారుణం జరిగింది. కూతుర్ని కంటి పాపలా కాపాడాల్సి తండ్రే... కామంతో కళ్లు మూసుకుపోయి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తండ్రి చేస్తున్న దారుణ చర్యను మౌనంగా భరిస్తూ వచ్చిన ఆ చిన్నారి... విషయం తల్లికి తెలిసిపోవడంతో గొల్లుమంది. స్థానికంగా సంచలనం క్రియేట్ చేసిన ఈ సంఘటన హైదరాబాద్‌లోని మల్కాజిగిరి ఏరియాలో వెలుగుచూసింది. మల్కాజిగిరి ఏరియాలో నివాసం ఉంటున్న ఇద్దరు భార్యాభర్తలు టీ దుకాణం నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. 14 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరికి నలుగురు సంతానం. ముగ్గురు అమ్మాయిలు, ఓ అబ్బాయిల్లో పెద్ద కూతురి వయసు 13 ఏళ్లు, రెండో కూతురి వయసు 12 ఏళ్లు. టీ బండి ద్వారా పెద్దగా ఆదాయం లేకపోవడంతో కొన్నిరోజులుగా 20 ఏళ్ల తండ్రి కూలీపనులకు వెళ్తున్నాడు. అయితే భర్త కూలీ పనులకు వెళ్లగానే భార్య టీ దుకాణం దగ్గరికి వెళ్లింది. రాత్రి 10 గంటల సమయంలో దుకాణం బంద్ చేసి... ఇంటికొచ్చి చూడగా బయట ముగ్గురు పిల్లలు కనిపించారు. 12 ఏళ్ల రెండో కూతురు వారితో కనిపించలేదు. లోపలికి వెళ్లి చూడగా గదిలో తండ్రి, చిన్నకూతురు నగ్నంగా కనిపించారు. ఆ దృశ్యాన్ని చూసి ఒక్కసారిగా షాకైన ఆమె... కన్నకూతురితో నీచంగా ప్రవర్తిస్తున్న మృగాన్ని పట్టుకోవాలని ప్రయత్నించింది. అయితే అతను ఆమె నుంచి తప్పించుకుని పారిపోయాడు. కూతుర్ని విషయం అడగగా జరిగిన దారుణాన్ని కన్నీళ్లతో వెల్లడించింది. ఇంటి ముందు ఆడుకుంటున్న తనను... లోపలికి రమ్మని పిలిచిన తండ్రి ఇలా చేశాడంటూ చెప్పింది. ఇదే మొదటిసారి కాదని, ఇంతకుముందు రెండు సార్లు ఇలాగే చేసినట్టు చెప్పింది.

కన్నకూతురితో నీచంగా ప్రవర్తించిన తండ్రిపై పోలీసులకు ఫిర్యాదు చేసిందామె. కేసు నమోదుచేసుకున్న పోలీసులు... రెండు రోజుల పాటు గాలించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. రెండో కూతురిపైనే ఇలాంటి దారుణానికి పాల్పడ్డాడా? లేక ముగ్గురితోనూ ఇలాగే ప్రవర్తించాడా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

First published: May 25, 2019, 7:51 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading