ప్రతీకాత్మక చిత్రం
హైదరాబాద్ మహానగరంలో దారుణం వెలుగుచూసింది. వరుసకు మనవరాలు అయ్యే చిన్నారిపై అత్యంత అమానవీయంగా అఘాయిత్యానికి పాల్పడ్డాడో ప్రబుద్ఢుడు. ఆ తాత దారుణచర్య కారణంగా బాలిక గర్భం దాల్చింది. ఇరుగు పొరుగు మాటలు పడలేక ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికంగా సంచలనం క్రియేట్ చేసిన ఈ సంఘటన హైదరాబాద్ మహానగరంలోని మీర్‌పేట ఏరియాలో వెలుగుచూసింది. మీర్‌పేట ప్రశాంతినగర్‌కు చెందిన మొగులయ్యకు భార్య పున్నమ్మ, ముగ్గురు కుమార్తెలు ఉండేవారు. అయితే 2008లో భార్య చనిపోవడంతో ఆ తర్వాతి ఏడాది మిర్యాలగూడ ఏరియాకు చెందిన దుర్గమ్మ అనే యువతిని రెండో పెళ్లి చేసుకున్నాడు మొగులయ్య. దుర్గమ్మ చెల్లెలు నాగమ్మ కూడా ప్రశాంతినగర్ ఏరియాలో నివాసం ఉంటోంది. నాగమ్మ మేనమామ మల్లేష్... తరచూ దుర్గమ్మ ఇంటికి వస్తుండేవాడు. ఈ క్రమంలో మొగులయ్య కూతుర్లపై కన్నేసిన తాత మల్లేష్... వారికి చాక్లెట్లు తెచ్చి, మాయమాటలతో దగ్గరయ్యేవాడు. ఇలా మొగులయ్య రెండో కూతురిని శారీరకంగా లోబర్చుకున్న మల్లేష్... ఆమెపై చాలాసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. 14 ఏళ్ల బాలిక, తాత చేస్తున్న పని ఎవ్వరికీ చెప్పుకోవాలో తెలియక తనలో తానే కుమిలిపోయింది. అయితే నెల రోజుల క్రితం బాలిక తీవ్రమైన కడుపునొప్పితో బాధపడడంతో తల్లిదండ్రులు, ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ బాలికను పరీక్షించిన వైద్యులు... గర్భం దాల్చిందని తేల్చారు.
మల్లేష్ చేసిన పాడు పని తెలుసుకున్న మొగులయ్య, దుర్గమ్మ... అతనిపై పంచాయతీలో ఫిర్యాదు చేశారు. పెద్దల సమక్షంలో మల్లేష్‌ను విచారించి, అతను నష్టపరిహారంగా రూ. 1.5 లక్షలు బాలిక కుటుంబానికి తీర్మానించారు. ఈ పరిణామాలతో తీవ్మైన మనస్థాపం చెందిన బాలిక... ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. చిన్నారి బలవన్మరణం పాల్పడడంతో కేసు నమోదుచేసుకున్న పోలీసులు... ఏం జరిగిందని ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న నిందితుడు మల్లేష్ పరారీలో ఉన్నాడు. అతని కోసం గాలిస్తున్న పోలీసులు... అత్యాచారంతో పాటు పోస్కో యాక్ట్ కింద కేసులు నమోదుచేశారు.
First published:
May 9, 2019, 3:43 PM IST