హైదరాబాద్‌లో దారుణం... కూతురిపై కన్నతండ్రి అఘాయిత్యం...

ఇంట్లో ఒంటరిగా ఉన్న 15 ఏళ్ల కూతురితో అసభ్యంగా ప్రవర్తించిన కన్నతండ్రి... అతని నుంచి తప్పించుకుని పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 10, 2019, 9:03 PM IST
హైదరాబాద్‌లో దారుణం... కూతురిపై కన్నతండ్రి అఘాయిత్యం...
హైదరాబాద్‌లో దారుణం... కూతురిపై కన్నతండ్రి అఘాయిత్యం...
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 10, 2019, 9:03 PM IST
మద్యం మత్తులో కన్నతండ్రి ఘాతుకానికి ఒడిగట్టాడు. కన్నూ, మిన్నూ తెలియకుండా మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. స్థానికంగా సంచలనం క్రియేట్ చేసిన ఈ సంఘటన దాదాపు మూడేళ్ల కిందట హైదరాబాద్ నగరంలోని మీర్‌పేట ఏరియాలో జరిగింది. మీర్‌పేటలోని జిల్లెలగూడ ఏరియాకు చెందిన మహేందర్... మద్యానికి బానిసయ్యాడు. రోజూ తాగి వచ్చి భార్యను కొడుతూ, తిడుతూ వేధించేవాడు. భర్త పెట్టే చిత్రవధ భరించలేకపోయిన మహేందర్ భార్య... అతన్ని వదిలేసి, పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే వారి పిల్లలు మాత్రం మహేందర్ తోనే ఉండేవారు. భార్య వెళ్లిపోయిన తర్వాత కూడా మద్యం తాగడం, ఇంటికొచ్చి గొడవ చేయడం మానని మహేందర్... ఇంట్లో ఒంటరిగా ఉన్న 15 ఏళ్ల కూతురితో అసభ్యంగా ప్రవర్తించాడు. తాగిన మత్తులో చిన్నారిపై అత్యాచారానికి యత్నించాడు. తండ్రి నుంచి ఎలాగో తప్పించుకున్న అతని కూతురు, పోలీసులకు ఫిర్యాదు చేసింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు... నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో మహేందర్ చేసిన తప్పును అంగీకరించడంతో తాజాగా అతనికి మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ, తీర్పు వెలువరించింది సైబరాబాద్ మెట్రోపాలిటిన్ సెషన్స్ కోర్టు.

హైదరాబాద్ నగరంలో ఇలాంటి నేరాలు ఈ మధ్య కాలంలో విపరీతంగా పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. అల్వాల్ ఏరియాలో ఆరేళ్ల చిన్నారిని ఓ బీహారీ యువకుడు, అత్యాచారం చేసి చంపేసిన సంఘటన మరవకముందే... శాలిబండ ఏరియాలో ఏడేళ్ల పసికందుపై అత్యాచారానికి యత్నించాడు ఓ ఆటోడ్రైవర్.
First published: April 10, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...