హైదరాబాద్‌లో దారుణం... భార్య కూతురిపై తండ్రి అఘాయిత్యం...

హైదరాబాద్‌లోని మౌలాలి ఏరియాలో దారుణం... మద్యానికి బానిసై భార్యను చిత్రహింసలు పెట్టిన ఆటోడ్రైవర్... ఆమె కూతురిపై అసభ్య ప్రవర్తన...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 25, 2019, 3:53 PM IST
హైదరాబాద్‌లో దారుణం... భార్య కూతురిపై తండ్రి అఘాయిత్యం...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
హైదరాబాద్ మహానగరంలో మరో దారుణం వెలుగుచూసింది. భార్యకు మొదటి భర్త ద్వారా పుట్టిన కూతురిపై, అత్యంత దారుణంగా ప్రవర్తించాడో ఆటోడైవర్. స్థానికంగా సంచలనం క్రియేట్ చేసిన ఈ సంఘటన హైదరాబాద్‌లోని మల్కాజిగిరి నియోజికవర్గంలో ఉన్న మౌలాలి ఏరియాలో జరిగింది. మౌలాలి ఆర్టీసీ కాలనీలో నివాసం ఉంటున్న 23 ఏళ్ల మహ్మద్ హపీజ్... ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అదే ఏరియాకు చెందిన ఓ మహిళతో అతనితో పరిచయం ఏర్పడింది. భర్త నుంచి విడాకులు తీసుకుని, పిల్లలతో ఉంటున్న సదరు మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఆటోడ్రైవర్ మహ్మద్ హఫీజ్... ఆరు నెలల క్రితం ఆమెను పెళ్లి చేసుకున్నాడు. హఫీజ్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత మొదటి భర్త సంతానాన్ని తల్లి దగ్గర ఉంచిన ఆమె... హఫీజ్‌తో కలిసి మౌలాలిలోనే నివాసం ఉంటోంది. పెళ్లైన మూడు నెలల తర్వాత మద్యానికి బానిసైన మహ్మద్ హఫీజ్... నిత్యం తాగి వచ్చి భార్యను వేధించడం మొదలుపెట్టాడు. మద్యం మత్తులో తిడుతూ, కొడుతూ భర్త పెట్టే చిత్రహింసలను భరిస్తూ వచ్చిందామె.

అయితే ఏప్రిల్ 6న ఆమె 12 ఏళ్ల కూతురు, తల్లిని చూసేందుకు మౌలాలి ఏరియాకు చేరింది. తల్లిని చూడడానికి వచ్చిన కూతురి ముందే భార్యను చితకబాదిన హాఫీజ్... తల్లి బయటికి వెళ్లిన తర్వాత చిన్నారిపై అసభ్యంగా ప్రవర్తించాడు. ఇంట్లో ఎవ్వరూలేని సమయంలో కూతురి లాంటి బాలికపై అత్యాచారానికి యత్నించాడు. సమయానికి ఇంటికి తల్లి రావడంతో చిన్నారి పెను ప్రమాదం నుంచి తప్పించుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న హాఫీజ్ నిజస్వరూపం చూసి, భరించలేకపోయిన అతని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదుచేసుకున్న పోలీసులు... సంఘటనా స్థలానికి చేరుకునేలోపు అతను అక్కడి నుంచి పరారయ్యాడు. 19 రోజుల పాటు అతన్ని గాలించిన పోలీసులు... బుధవారం అతన్ని అరెస్ట్ చేశారు.
First published: April 25, 2019, 3:30 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading