హైదారాబాద్‌లో దారుణం... మూడేళ్ల చిన్నారిపై యువకుడి అత్యాచారం... రక్తస్రావం కావడంతో...

మనవరాలిని చూసుకొమ్మని పక్కింటి కుర్రాడిని కోరిన అమ్మమ్మ... ఇంట్లోకి తీసుకెళ్లి బాలికపై లైంగికదాడికి పాల్పడిన యువకుడు... పటాన్‌చెరు ఏరియాలో వెలుగుచూసిన దారుణం...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 12, 2019, 11:00 AM IST
హైదారాబాద్‌లో దారుణం... మూడేళ్ల చిన్నారిపై యువకుడి అత్యాచారం... రక్తస్రావం కావడంతో...
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
హైదరాబాద్ మహానగరంలో చిన్నారులకు రక్షణ లేకుండా పోతోంది. కొన్నాళ్ల కిందట ఆరేళ్ల బాలికపై హత్యాచార సంఘటన మరువకముందే... నగరశివారులోని పటాన్‌చెరు సమీపంలో మరో చిన్నారి కామంధుడి చేతుల్లో అఘాయిత్యానికి గురైంది. నగరవాసులకు భయభ్రాంతులకు గురి చేస్తున్న ఈ సంఘటన పటాన్‌‌చెరు సమీపంలోని అమీన్‌పూర్ మండలం సుల్తాన్‌పూర్ గ్రామంలో వెలుగుచూసింది. గ్రామంలోని గండిగూడ కాలనీకి చెందిన అభయ్‌కుమార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి వచ్చి నగరంలో సెటిల్ అయ్యాడు. అతని ఇంటి పక్కనే ఓ తల్లి, బిడ్డా, మనవరాలు ఉంటున్నారు. అమ్మమ్మ, తల్లి, ఆమె మూడేళ్ల కూతురు నివాసం ఉంటున్నారు. బాలిక తాత చనిపోగా... తండ్రి ఉద్యోగం నిమిత్తం విదేశాల్లో సెటిల్ అయ్యాడు. దాంతో తల్లితో కలిసి బిడ్డను చూసుకుంటూ జీవనం సాగిస్తోంది చిన్నారి. కొన్నిరోజులుగా చిన్నారి తల్లి అనారోగ్యంతో బాధపడుతోంది. దాంతో ఇంటి పనులతో పాటు బిడ్డ ఆలనాపాలనా చూసుకుంటోంది అమ్మమ్మ.

అయితే మంగళవారం నీళ్లు తెచ్చేందుకు వెళుతూ... పాపను పక్కింట్లో ఉంటున్న అభయ్ కుమార్‌కు ఇచ్చి వెళ్లింది. నీళ్లు తీసుకుని ఇప్పుడే వస్తానని, అప్పటిదాకా తన మనవరాలిని చూసుకొమ్మని అతన్ని కోరింది. దానికి సరేనన్న అభయ్... పాపను ఇంట్లోకి తీసుకెళ్లి అత్యంత అమానుషంగా అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తర్వాత పాప అమ్మమ్మ రాగానే, చిన్నారిని తెచ్చి ఇచ్చాడు. అయితే అభయ్ రాక్షస చర్య కారణంగా చిన్నారికి తీవ్రరక్తస్రావం అయ్యింది. వెంటనే అనుమానంతో అమ్మమ్మ, అమ్మ వెళ్లి అభయ్ కుమార్‌ను నిలదీశారు. మొదట పాప తనకేం తెలియదని చెప్పిన అభయ్... ఆ తర్వాత ఇద్దరినీ తోసి అక్కడి నుంచి పారిపోయాడు. వెంటనే పాపను ఆసుపత్రికి తీసుకెళ్లిన తల్లి, అమ్మమ్మ... అభయ్ కుమార్‌‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు, నిందితుడు అభయ్‌ని బుధవారం అదుపులోకి తీసుకున్నారు.

First published: April 11, 2019, 11:59 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading