ఇద్దరితో మహిళ లైంగిక సంబంధం.. వెంటాడి చంపిన వ్యక్తి

నిర్మల భర్త రెండేళ్ల క్రితం చనిపోయాడు. ఆ తర్వాత ఆమెకు శ్రీనివాసరావుతో సంబంధం ఏర్పడిందని గ్రామస్తులు చెబుతున్నారు.

news18-telugu
Updated: May 15, 2019, 8:56 PM IST
ఇద్దరితో మహిళ లైంగిక సంబంధం.. వెంటాడి చంపిన వ్యక్తి
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: May 15, 2019, 8:56 PM IST
భర్త చనిపోయిన ఓ మహిళ.. తనతో కాకుండా మరో వ్యక్తితో కూడా లైంగిక సంబంధం కొనసాగిస్తుందన్న అనుమానంతో ఓ వ్యక్తి ఆమెను దారుణంగా చంపేశాడు. గుంటూరు జిల్లాలో ఈ దారుణం జరిగింది. రేపల్లె మండలం పేటేరు గ్రామ పంచాయతీ వద్ద నిర్మల అనే మహిళ కూరగాయల సంచితో నిలబడి ఉంది. ఆ సమయంలో అక్కడకు వచ్చిన శ్రీనివాసరావు అనే వ్యక్తి ఆమె మీద కత్తితో దాడి చేయబోయాడు. దీంతో బాధితురాలు రోడ్డు మీద పరుగులు పెట్టింది. అయినా, శ్రీనివాసరావు ఆమెను వెంటాడాడు. చివరకు ఆమెను పట్టుకుని కత్తితో దాడి చేశాడు. మెడ మీద కత్తితో వేటు వేయడంతో ఆమె తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. డొక్కు నిర్మల భర్త రెండేళ్ల క్రితం చనిపోయాడు. ఆ తర్వాత ఆమెకు శ్రీనివాసరావుతో సంబంధం ఏర్పడిందని గ్రామస్తులు చెబుతున్నారు. అయితే, తనతో కాకుండా నిర్మల మరో వ్యక్తితో కూడా సంబంధం కొనసాగిస్తుండడంతో కోపం వచ్చిన శ్రీనివాసరావు కత్తితో వెంటాడి చంపినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

First published: May 15, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...