అత్యాచారం నుంచి తప్పించుకునేందుకు నగ్నంగా బయటికి వచ్చిన యువతి...

కారు డ్రైవింగ్ నేర్పించే సాకుతో భర్తతో సాన్నిహిత్యం పెంచుకున్న భారతీయుడు... భార్య ఒంటరిగా ఉన్న సమయంలో ఇంట్లోకి ప్రవేశించి అత్యాచారయత్నం... రేప్ నుంచి తప్పించుకునేందుకు నగ్నంగా బయటికి పరుగెత్తిన మహిళ... అతన్ని ఇంట్లో పెట్టి లాక్ వేసి పోలీసులకు సమాచారం...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: March 6, 2019, 8:16 PM IST
అత్యాచారం నుంచి తప్పించుకునేందుకు నగ్నంగా బయటికి వచ్చిన యువతి...
నమూనా చిత్రం
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: March 6, 2019, 8:16 PM IST
ఒంటరిగా నిద్రపోతున్న మహిళ బెడ్‌రూమ్‌లోకి వెళ్లిన ఓ వ్యక్తి... ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించాడు. ఆమె ఒంటిమీద ఉన్న దుస్తులన్నీ చింపేసి నగ్నంగా మార్చేశాడు. ఆమెపై లైంగిక దాడికి శతవిధాలా ప్రయత్నించాడు. అయితే అతని నుంచి తప్పించుకునేందుకు ఆమె అలాగే బయటికి వచ్చేసింది. నగ్నంగా బయటికి వచ్చిన యువతిని షాక్‌కు గురైన జనం... ఆమె పరిస్థితి చూసి జాలి పడ్డాడు. చివరికి అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. స్థానికంగా హాట్ టాపిక్ అయిన ఈ సంఘటన దుబాయ్‌లో జరిగింది. ఈ సంఘటనలో యువతిపై లైంగిక దాడికి పాల్పడింది ఓ భారతీయుడు కావడం విశేషం. బతుకు తెరువు కోసం దుబాయ్ వెళ్లిన ఓ 32 ఏళ్ల భారతీయుడు... తన పక్క ఫ్లాట్‌లో నివాసముంటునన భార్యాభర్తలతో పరిచయం ఏర్పరచుకున్నాడు. శ్రీలంక దేశానికి చెందిన ఈ దంపతులు కూడా స్వదేశాన్ని వదిలి, ఉద్యోగం కోసం గల్ఫ్ కంట్రీకి వచ్చినవారే.

భారతీయుడి వద్ద కారు కూడా ఉంది. కారు డ్రైవింగ్ నేర్పించే సాకుతో భర్తతో సాన్నిహిత్యం పెంచుకున్న అతను... తరుచూ వారింటికి వెళ్లేవాడు. భార్యపై కన్నేసిన అతను... ఆమె ఒంటరిగా ఉన్న సమయంలో ఇంట్లోకి ప్రవేశించాడు. నిద్రపోతున్న మహిళపై దాడి చేసి, ఆమె దుస్తుల్ని మొత్తం చింపేశాడు. పూర్తి నగ్నంగా మారిన ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. ఈ ఆకస్మిక దాడికి షాక్‌కు గురైన ఆమె... వెంటనే తేరుకుని అతన్ని ప్రతిఘటించింది. రేప్ నుంచి తప్పించుకునేందుకు ఏం చేయాలో తెలియక... నగ్నంగా బయటికి పరుగెత్తింది. బయటికి వచ్చిన తర్వాత అరుపులు, కేకలు వేసింది. అతను లోపలి నుంచి పారిపోకుండా డోర్ మూసి, లాక్ చేసేసింది. నగ్నంగా ఉన్న మహిళను చూసి షాక్‌కు గురైన స్థానికులు... ఆమె ఉన్న పరిస్థితి అర్థం చేసుకుని సాయం చేశాడు. ఆమెకు దుస్తులు అందించి, పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు... అతన్ని అరెస్ట్ చేసి, న్యాయస్థానంలో హాజరుపరిచారు. గదిలో ఉన్న సీసీటీవీ కెమెరాలతో పాటు బయట సెక్యూరిటీ కోసం ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లోనూ ఈ దృశ్యాలన్నీ రికార్డు కావడం విశేషం.First published: March 6, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...