తండ్రి శవంతో 2500 కి.మీ.ల ప్రయాణం... ఆసుపత్రి ఫీజులు కట్టలేక...

ఆసుపత్రి ఫీజులు చెల్లించే స్తోమత లేక స్వగ్రామానికి బయలు దేరిన జంట... హత్య చేశారనే అనుమానంతో కెనడా సరిహద్దులో అరెస్ట్...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 3, 2019, 4:06 PM IST
తండ్రి శవంతో 2500 కి.మీ.ల ప్రయాణం... ఆసుపత్రి ఫీజులు కట్టలేక...
తండ్రి శవంతో 2500 కి.మీ.ల ప్రయాణం... ఆసుపత్రి ఫీజులు కట్టలేక...(నమూనా చిత్రం)
  • Share this:
ఆసుపత్రి బిల్లులు కట్టలేక, తండ్రి శవంతో వేల కిలోమీటర్లు ప్రయాణం చేసిందో కుటుంబం. అలాగని వారు ప్రయాణం చేసిందో నడకమార్గంలోనే, బస్సు మార్గంలోనే.. లగ్జరీ కారులో. అవును... వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది ఫ్లోరిడా ఓ కుటుంబం అనుభవించిన విషాద సంఘటన ఇది. క్యూబెక్ ఏరియాకు చెందిన లూయిస్, తన కుటుంబంతో కలిసి ఫ్లోరిడా యాత్రకు వెళ్లాలనుకున్నాడు. 87 ఏళ్ల తండ్రి ఫెర్నాండ్‌ను ఇంట్లో ఒంటరిగా ఉంచడం ఇష్టం లేక, తన వెంట తీసుకెళ్లాడు. ప్లానింగ్ ప్రకారం కుటుంబమంతా కలిసి ఫ్లోరిడా చేరుకున్నాడు. కాసేపు సరదాగా ఫ్లోరిడా వీధుల్లో విహరించారు. వెనుక సీట్లో కూర్చొని కొడుకు, కోడలితో సరదాగా మాట్లాడిన ఫెర్నాండ్...ఒక్కసారిగా సైలెంట్ అయిపోయాడు. ఏమైందోనని కంగారుగా తండ్రిని పిలిచాడు లూయిస్. ఎంతకీ పలకకపోవడంతో అనుమానం వచ్చి కారు ఆపి పరిశీలించగా... ఫెర్నాండ్ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసింది. ఫెర్నాండ్ చనిపోయిన విషయం నిర్థారణ అయినా ఆసుపత్రికి తీసుకెళ్లడానికి లూయిస్‌కు ధైర్యం చాలలేదు.

ఫ్లోరిడా సిటీలో ఆసుపత్రి ఫీజులు భారీగా ఉండడం, దాన్ని చెల్లించే స్తోమత తనకు లేకపోవడంతో స్వగ్రామానికి కారులో బయలు దేరాడు లూయిస్. అలా 2500 కి.మీ. దూరం ప్రయాణించి కెనడాకు చేరుకున్నాడు. ఈ సుదూర ప్రయాణంలో లూయిస్ కారుని ఎక్కడా పోలీసులు అడ్డుకోకపోవడం విశేషం. కెనడా సరిహద్దులో ఉన్న అధికారులు కారుని ఆపి, తనిఖీ చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. శవాన్ని పెట్టుకుని, ప్రయాణం చేస్తున్న లూయిస్, అతని భార్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు... మృతదేహాన్ని పరీక్షించారు. అతని శరీరంపై ఎక్కడా గాయాలు లేకపోవడంతో సహజ మరణంగా నిర్ధారించుకున్నారు. లూయిస్‌ను తమదైన శైలిలో విచారణ చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దాదాపు 24 గంటల పాటు ప్రయాణం చేసి, తన తండ్రి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లాలని లూయిస్ చేసిన ప్రయత్నం, వారిని ఆశ్చర్యానికి గురి చేసింది.

First published: April 3, 2019, 4:05 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading