ఇల్లు చూపిస్తానని పిలిచి... యువతిపై అత్యాచారం... అత్యంత దారుణంగా...

కాలిఫోర్నియా ఇల్లు కొనుక్కోవాలని రియల్ ఎస్టేట్ ఏజెంట్‌ను సంప్రదించిన యువతి... ఇల్లు చూపిస్తానని పిలిపించి, నిర్మానుష్య ఇంట్లో ఆమెపై అత్యాచారానికి పాల్పడిన బ్రోకర్... విషయం బయటికి వస్తే చంపేస్తానని బెదిరింపులు...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: March 20, 2019, 7:03 PM IST
ఇల్లు చూపిస్తానని పిలిచి... యువతిపై అత్యాచారం... అత్యంత దారుణంగా...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఆమె సొంత ఇల్లు కొనుక్కుని స్థిరపడాలనుకుంది. అదే కోరికతో రియల్ ఎస్టేట్ ఏజెంట్‌ను కలిసి ఇంటి గురించి డిస్కర్షన్ కూడా చేసింది. ఇల్లు చూపిస్తానని చెప్పిన సదరు ఏజెంట్... ఆమెపై అదే ఇంట్లో అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఈ విషయం ఎవరికైనా చెబితే, తన మనుషులతో చంపిస్తానని బెదిరించాడు. స్థానికంగా సంచలనం క్రియేట్ చేసిన ఈ సంఘటన ఇక్కడ జరిగింది కాదు. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఆలస్యంగా వెలుగుచూసిన దారుణ సంఘటన. చైనాకు చెందిన 38 ఏళ్ల వన్వర్త్ హువాంగ్ వాంగ్ అనే వ్యక్తి... బతుకు తెరువు కోసం అమెరికా వచ్చాడు. కాలిఫోర్నియాలో రియల్ ఎస్టేట్ బ్రోకర్‌గా సెటిల్ అయ్యాడు. తమ దేశానికి చెందిన ఓ మహిళ...కాలిఫోర్నియాలో ఉద్యోగం చేస్తోంది. అలా దాచుకున్న డబ్బులతో సొంత ఇల్లు కొనుక్కుని, అక్కడే సెటిల్ అవ్వాలని ఆశ పడింది. స్థానికంగా రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా ఉన్న తమ దేశపు వ్యక్తి హువాంగ్ వాంగ్‌ను కలిసి, తన ఆలోచనను వివరించింది.

ఆమె అందాన్ని చూసి మోజుపడిన హువాంగ్ వాంగ్... తక్కువ ధరలో మంచి ఇల్లు దొరికిందని చెప్పి ఆమెను పిలిపించాడు. అతని మాటలు నమ్మి, వచ్చిన ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తర్వాత విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరింపులకు దిగాడు. పోలీసులకు చెప్పినా, లాభం ఉండదని... అంతా తనకు తెలిసిన వారేనని హెచ్చరించాడు. అతని మాటలకు భయపడిన ఆమె... చాలారోజులు మౌనంగా ఉండిపోయింది. ఇల్లు కొనుక్కోవాలనే ఆలోచన కూడా విరమించుకుని, స్వదేశానికి వెళ్లిపోవాలని ఫిక్స్ అయ్యింది. స్వదేశానికి వెళ్లే ముందు, పోలీసులకు హువాంగ్ వాంగ్ గురించి ఫిర్యాదు చేసంది. కేసు నమోదు చేసిన పోలీసులు... హువాంగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆశ్చర్యకరంగా అతను ఇంతకు ముందు ఇదే మాదిరిగా ముగ్గురు ఒంటరి మహిళలపై అత్యాచారానికి పాల్పడినట్టు తేలింది.

First published: March 20, 2019, 7:02 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading