ప్రియుడి మీద పగ తీర్చుకునేందుకు... 20 మంది మగాళ్లతో శృంగారం చేసిన యువతి...

మూడేళ్లుగా డేటింగ్ చేస్తున్న బాయ్‌ఫ్రెండ్ వేరే అమ్మాయితో ఎఫైర్ పెట్టుకున్నాడని తెలిసి రగిలిపోయిన యువతి... అతని మీద ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంతో 20 మంది మగాళ్లతో ఆ పని...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 30, 2019, 10:22 PM IST
ప్రియుడి మీద పగ తీర్చుకునేందుకు... 20 మంది మగాళ్లతో శృంగారం చేసిన యువతి...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఆమె అతన్ని ప్రేమించింది. అతను మాత్రం ఆమెతో పాటు మరో అమ్మాయితో కూడా ఎఫైర్ పెట్టుకున్నాడు. బాయ్‌ఫ్రెండ్‌ వేరే అమ్మాయితో సంబంధం పెట్టుకున్న విషయం తెలుసుకున్న ఆమె... ఆగ్రహంతో రగిలిపోయింది. అతని మీద ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలనుకుంది. అందుకు ఏకంగా 20 మంది మగాళ్లతో శృంగారంలో పాల్గొంది. సోషల్ మీడియాలో పెను సంచలనం క్రియేట్ చేసిన ఈ సంఘటన బ్రిటన్ దేశంలో వెలుగు చూసింది. ఓ క్లబ్‌లో డ్యాన్సర్‌గా పని చేస్తున్న 26 ఏళ్ల యువతికి, అదే క్లబ్‌లో పనిచేసే యువకుడికి ప్రేమ చిగురించింది. మూడేళ్లుగా ఇద్దరూ డేటింగ్‌లో కూడా ఉన్నారు. అయితే అతని ఫోన్ అనుకోకుండా కింద పడి, స్క్రీన్ పగిలిపోయింది. తాను రిపేర్ చేయిస్తానని తీసుకున్న యువతి... అందులో ఉన్న పోటోలు చూసి షాక్‌కు గురైంది. మరో అమ్మాయితో తన బాయ్‌ఫ్రెండ్ సెక్స్ చేస్తున్న ఫోటోలు దర్శనమిచ్చాయి. మనసిచ్చిన వాడు ఇలా మోసం చేస్తాడని ఊహించని ఆమె... బాయ్‌ఫ్రెండ్‌ మీద కోపంతో రగిలిపోయింది. తాను ఎంత బాధపడుతున్నది అతనికి అర్థం అయ్యేలా చేయాలనుకుంది. అంతే నచ్చిన వ్యక్తితో శృంగారం చేయాలనుకుంది.

అలా క్లబ్‌లో రాత్రి పూట ఒంటరిగా వచ్చిన ఓ యువకుడితో పరిచయం ఏర్పరచుకుని, అతనితో హోటల్‌కు వెళ్లి ఫుల్లుగా ఎంజాయ్ చేసింది. ఆ తర్వాతి రోజు మరో యువకుడితో పరిచయం ఏర్పడింది. అతనితో కారులో శృంగారం చేసింది. ఇలా 20 రోజుల పాటు 20 మంది మగాళ్లతో సెక్స్ చేసింది సదరు యువతి. 20 మంది మగాళ్లతో శృంగారంలోపాల్గొన్న తర్వాత తనకు పగ తీరిందని చెబుతూ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిందామె. ఆ ఫోటోలు వైరల్ కావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఇందులో కొసమెరుపు ఏంటంటే... ఆమె బాయ్‌ఫ్రెండ్, తాను అనుకోకుండా వేరే అమ్మాయితో సెక్స్‌లో పాల్గొనాల్సి వచ్చిందని ప్రియురాలికి ఎలా చెప్పాలో తెలియక అలా ఫోన్ కిందపడి పగిలినట్టు డ్రామా ఆడాడంట. ఆ విషయం తెలియని ఆమె... ఆవేశంతో ఇలా చేసింది.
First published: April 30, 2019, 10:22 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading