ఐదేళ్ల తమ్ముడిని చంపి, అతని మర్మాంగాలను కోసుకుతిన్న 18 ఏళ్ల యువతి...

ఐదేళ్ల తమ్ముడిని దారుణంగా చంపి, అతని మర్మంగాన్ని కోసుకుతిన్న 18 ఏళ్ల సోదరి... బ్రెజిల్‌లోని సావో పాలో ఏరియాలో వెలుగుచూసిన దారుణం...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 10, 2019, 10:09 PM IST
ఐదేళ్ల తమ్ముడిని చంపి, అతని మర్మాంగాలను కోసుకుతిన్న 18 ఏళ్ల యువతి...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఆమెకు చిన్నతనం నుంచి క్షుద్రపూజలంటే, ఆత్రేంద్రియ శక్తులన్నా ఎంతో ఆసక్తి. మానవ అతీతమైన శక్తులు పొందాలని ఎంతో ఆసక్తిగా వీడియోలు, పుసక్తాలు చదువుతుండేది. అయితే హఠాత్తుగా ఒంటరిగా ఉన్న ఐదేళ్ల తమ్ముడిని దారుణంగా చంపి, అతని మర్మంగాన్ని కోసుకుతింది. ఎందుకిలా చేశావని అడిగితే ఆచారం అంటూ చెప్పి, పోలీసులకు షాక్ ఇచ్చింది. స్థానికంగా సంచలనం క్రియేట్ చేసిన ఈ సంఘటన బ్రెజిల్ దేశంలో వెలుగుచూసింది. బ్రెజిల్‌లోని సావో పాలో ఏరియాకు చెందిన ఓ మహిళకు ఓ 18 ఏళ్ల కూతురు కరీనా, ఐదేళ్ల కొడుకు ఉన్నారు. తల్లి మార్కెట్‌కు వెళుతూ, ఐదేళ్ల తమ్ముడిని చూసుకొమ్మని చెప్పి కరీనాకు అమ్మగించి వెళ్లింది. కాసేపు తమ్ముడితో బాగానే ఆడుకున్న ఆమె... తర్వాత వీడియో గేమ్ ఆడదామని తన బెడ్‌రూమ్‌లోకి తీసుకెళ్లింది. గదిలోకి తీసుకెళ్లి, తమ్ముడిని దిండుతో ఊపిరాడనివ్వకుండా చంపేసింది. తర్వాత చిన్నారి మర్మాంగాలను కోసుకుని తినేసింది. తర్వాత తమ్ముడి శవాన్ని కింద పెట్టి, చుట్టూ కొవ్వుతులు వెలిగించి, మధ్యలో కూర్చొని ఏదో పూజ చేసింది.

మార్కెట్‌కి వెళ్లిన తల్లి, తిరిగివచ్చి ఎంతసేపు తలుపు కొట్టినా కరీనా తలుపులు తెరవలేదు. దాంతో అనుమానం వచ్చి, చుట్టుపక్కలవారిని కేకేసింది. వారు వచ్చి, తలుపులు బద్దలుకొట్టారు. లోపల కనిపించిన దృశ్యాలను చూసి అంతా షాకయ్యారు. తమ్ముడి శవం చుట్టూ క్యాండిల్స్ పెట్టి, మధ్యలో కూర్చొని కనిపించింది కరీనా. ఆమె ఈ సంఘటనకు పాల్పడే ముందు ఎవ్వరితోనైనా మాట్లాడిందా? అనే అనుమానం వచ్చి సెల్‌ఫోన్ చెక్ చేయగా... మొబైల్‌ మంటల్లో కాలుతూ కనిపించింది. మెమొరీకార్డు కూడా తగులబెట్టేసింది కరీనా. ఆమె గదిలో డ్రగ్స్ కూడా దొరకడం విశేషం. పోలీసులు ఆమె డ్రగ్స్ మత్తులో ఇలా చేసి ఉంటుందని అనుమానిస్తుంటే... తల్లి మాత్రం చిన్నతనం నుంచి క్షుద్రపూజలు, ఆతేంద్రీయ శక్తులపైన కరీనాకు ఆసక్తి అని, అయితే ప్రాణంగా చూసుకునే తమ్ముడిని ఇలా చంపుతుందని ఊహించలేదని చెబుతోంది.
First published: April 10, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading