భర్త పక్కన ఉండగానే, నిద్రపోతున్న మహిళ దుస్తులు కత్తెరతో కత్తిరించి...

థాయ్‌లాండ్‌లో బ్రిటన్ యువతిపై అత్యాచారం... మద్యం మత్తులో రోడ్డు పక్కనే పడుకున్న టూరిస్ట్‌పై అఘాయిత్యానికి పాల్పడిన యువకుడు...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 30, 2019, 8:06 PM IST
భర్త పక్కన ఉండగానే, నిద్రపోతున్న మహిళ దుస్తులు కత్తెరతో కత్తిరించి...
భర్త పక్కన ఉండగానే, నిద్రపోతున్న మహిళ దుస్తులు కత్తిరించి...
  • Share this:
నిద్రపోతున్న మహిళ, దుస్తులు కత్తిరించి అత్యంత దారుణంగా అఘాయిత్యానికి పాల్పడ్డాడో తాగుబోతు. స్థానికంగా సంచలనం క్రియేట్ చేసిన ఈ సంఘటన థాయ్‌లాండ్ దేశ రాజధాని బ్యాంకాక్ నగరంలో వెలుగుచూసింది. బ్రిటిన్‌కు చెందిన ఓ జంట... థాయ్‌లాండ్ అందాలను చూడడానికి బ్యాంకాక్ సిటీకి చేరుకున్నారు. థాయ్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన కో ఫిఫి దీవుల్లో పర్యటనకు వెళ్లారు. రోజంతా ఆ ప్రాంత అందాలను ఆస్వాదిస్తూ గడిపారు. అయితే అక్కడ ఆలస్యం కావడంతో హోటల్‌కి తిరిగిరావడానికి సమయం సరిపోలేదు. దాంతో అక్కడే ఓ రెస్టారెంట్‌లో భోజనం చేసి, బీచ్‌ను చూస్తూ రెస్టారెంట్ ముందున్న ఖాళీ స్థలంలో కునుకు తీశారు. అతను, ఆమె ఇద్దరూ బికినీల్లో సేదతీరారు. వారు ఫుల్లుగా నిద్రపోతున్న సమయంలో అక్కడికి వచ్చిన ఓ థాయ్ యువకుడు, బికినీ వేసుకుని పడుకున్న ఆమె అందాలను చూసి, అతనిలో పిచ్చి కోరిక రేగింది. ఫుల్లుగా తాగేసి ఉన్న అతను... తన దగ్గరున్న కత్తెరతో నిద్రపోతున్న మహిళ... దుస్తులన్నీ కత్తిరించేశాడు. ఏం జరుగుతుందో ఆమెకు తెలియకుండానే ఆమె బట్టలన్నీ తీసేశాడు. ఆ తర్వాత ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. పక్కనే ఆమె భర్త నిద్రపోతుండడంతో ఆ యువతికి అత్యాచారం జరిగినట్టు కూడా తెలియరాలేదు.

ఉదయాన్ని లేచేసరికి బట్టలన్నీ కత్తిరించేసి ఉండడంతో అనుమానం వచ్చిన ఆమె... రెస్టారెంట్ ముందున్న సీసీటీవీ కెమెరాలను పరిశీలించి, జరిగిన అత్యాచారం విషయం వెలుగులోకి వచ్చింది. అతను రావడం దగ్గర్నుంచి, బట్టలు కత్తిరించడం, లోబర్చుకుని అఘాయిత్యానికి పాల్పడడం అంతా సీసీటీవీల్లో స్పష్టంగా రికార్డైంది. దాంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసిందా యువతి. కేసు నమోదుచేసుకున్న పోలీసులు... మద్యం మత్తులో అఘాయిత్యానికి పాల్పడిన యువకుడిని అరెస్ట్ చేశారు.


First published: April 30, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>