నెల్లూరు జిల్లాలో దారుణం... ఆ సంబంధం పెట్టుకున్నాడని యువకుడిపై గ్యాంగ్ రేప్...

నెల్లూరు జిల్లాలోని సుళ్లూరుపేట సమీపంలో దారుణం... తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్న యువకుడిపై ప్రతీకారం తీర్చుకునేందుకు స్నేహితులతో కలిసి గ్యాంగ్‌ రేప్‌కు పాల్పడిన వ్యక్తి...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: June 6, 2019, 3:32 PM IST
నెల్లూరు జిల్లాలో దారుణం... ఆ సంబంధం పెట్టుకున్నాడని యువకుడిపై గ్యాంగ్ రేప్...
నెల్లూరు జిల్లాలోని సుళ్లూరుపేట సమీపంలో దారుణం... తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్న యువకుడిపై ప్రతీకారం తీర్చుకునేందుకు స్నేహితులతో కలిసి గ్యాంగ్‌ రేప్‌కు పాల్పడిన వ్యక్తి...
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఓ యువకుడిపై తన స్నేహితులతో కలిసి గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డాడో భార్య. స్థానికంగా సంచలనం క్రియేట్ చేసిన ఈ సంఘటన నెల్లూరు జిల్లాలోని సుళ్లూరుపేట సమీపంలో వెలుగుచూసింది. దొరవారిసత్రం మండలంలోని ఉచ్చూరు గ్రామానికి చెందిన 26 ఏళ్ల యువకుడు... బుధవారం తన బైక్ రిపేర్ చేసుకుందామని సూళ్లూరుపేటలో ఉన్న యమహా షోరూంకి వచ్చాడు. అయితే తిరిగి వచ్చే సమయంలో నాగరాజపురం గ్రామానికి చెందిన దయాకర్, బాలచెన్నయ్య, బాలచెన్నయ్య, వెంకటేశ్వర్లు, మహేశ్, మస్తాన్... యువకుడిని చుట్టుముట్టారు. అడ్రెస్ అడుగుతున్నట్టుగా మాటల్లో పెట్టి, ఆటోలో కిడ్నాప్ చేశారు. అతన్ని మన్నారుపోలూరు గ్రామ శివారులోని తైలం చెట్లలోకి తీసుకెళ్లిన యువకుల గ్యాంగ్... అతనిపై కర్రలతో దాడి చేశారు. తర్వాత ఐదుగురు కలిసి యువకుడిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా ఈ దృశ్యాలను మొబైల్‌లో వీడియో రికార్డు చేశారు. విషయం ఎవ్వరికైనా చెబితే... వీడియోను సోషల్ మీడియాలో పెట్టడమే కాకుండా చంపేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. అనుకోని సంఘటనతో షాక్‌కు గురైన సదరు యువకుడు... కాసేపటికి తేరుకుని సూళ్లూరుపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

యువకుడిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన గ్యాంగ్‌లో ఓ వ్యక్తితో సదరు బాధితుడికి వివాహేతర సంబంధం ఉన్నట్టు తేల్చారు పోలీసులు. తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న యువకుడిపై ప్రతీకారం తీర్చుకునేందుకే ఈ రకంగా స్నేహితులతో కలిసి గ్యాంగ్‌ రేప్‌కు పాల్పడినట్టు అనుమానిస్తున్నారు పోలీసులు.
Published by: Ramu Chinthakindhi
First published: June 6, 2019, 2:53 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading