ప్రియుడితో వెళ్తుంటే ఆపాడని... కన్నతండ్రిపై కత్తితో దాడి చేసిన వివాహిత...

ప్రియుడితో పారిపోయేందుకు యత్నించిన వివాహిత... అడ్డుకున్నాడని తండ్రిపై కత్తితో దాడి... ప్రియుడికి సహకరించిన కూతురు... తూర్పుగోదావరి జిల్లాలో దారుణం...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 24, 2019, 8:46 PM IST
ప్రియుడితో వెళ్తుంటే ఆపాడని... కన్నతండ్రిపై కత్తితో దాడి చేసిన వివాహిత...
ప్రియుడితో వెళ్తుంటే ఆపాడని... కన్నతండ్రిపై దాడి చేసిన వివాహిత...
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 24, 2019, 8:46 PM IST
ఆమెకు పెళ్లైంది. పిల్లలు కూడా ఉన్నారు. అయినా మరో వ్యక్తిని ప్రేమించింది. భర్త పిల్లల కంటే ప్రియుడితో జీవితమని భావించింది. పథకం ఇద్దరూ లేచిపోవడానికి అన్నీ సిద్ధం చేసుకున్నారు. అయితే విషయం తెలుసుకున్న ఆమె తండ్రి అడ్డుకున్నాడు. తన సుఖానికి అడ్డుగా ఉన్నాడని కన్నతండ్రిపైనే దాడి చేసి తీవ్రంగా గాయపర్చిందామె. స్థానికంగా సంచలనం క్రియేట్ చేసిన ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాలో వెలుగుచూసింది. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి పాతూరుకు చెందిన వెంకటేశ్వర్లు, తన కూతురిని అదే గ్రామానికి చెందిన వ్యక్తికిచ్చి పెళ్లి చేశాడు. పెళ్లైన తర్వాత కొన్నాళ్లు బాగానే కాపురం చేసిన ఆమె... ఆ తర్వాత వివాహేతర సంబంధం పెట్టుకుంది. అనపర్తి పాతూరులో స్కూల్ బస్సుకు క్లీనర్‌గా పని చేస్తున్న మణికంఠతో ఆమెకు ఏర్పడిన పరిచయం... వివాహేతర సంబంధానికి దారి తీసింది. తన కూతుర్ని బస్సులో ఎక్కిస్తున్న సమయంలో క్లీనర్‌తో పరిచయం ఏర్పడి మాటలు కలిపి, శారీరక సంబంధం ఏర్పరచుకున్నాడు మణికంఠ. ప్రియుడితో సంబంధానికి భర్త, పిల్లలు అడ్డుగా ఉండడంతో అతనితో వెళ్లిపోయేందుకు పథకం పన్నింది. కూతురి ఆలోచనను గ్రహించిన వెంకటేశ్వర్లు... ఆమె, మణికంఠతో వెళ్తున్న సమయంలో చూసి, అడ్డుకునేందుకు ప్రయత్నించాడు.

భర్తా, పిల్లలతో వదిలేసి వెళ్లి, కుటుంబం పరువు తీయొద్దని వేడుకున్నాడు. అయితే తండ్రి మాటలు పట్టించుకోని ఆమె... మళ్లీ తిరిగి ఇంటికి వచ్చేందుకు ససేమీరా అంది. దాంతో కూతుర్ని కొట్టి, తీసుకెళ్లాలని భావించాడు వెంకటేశ్వర్లు. ప్రియసిపై ఆమె తండ్రి దాడి చేయడం చూసిన మణికంఠ... వెంకటేశ్వర్లుపై దాడి చేశాడు. కత్తి తీసుకుని పొడిచేశాడు. తండ్రిపై ప్రియుడితో కత్తితో దాడి చేయడాన్ని కళ్లరా చూసిన ఆమె... అతన్ని ఆపాల్సింది పోయి సహకరించింది. తాను కూడా కత్తితో తండ్రిని పొడిచింది. తర్వాత ఇద్దరూ పరారయ్యారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు... తీవ్రంగా గాయపడిన వెంకటేశ్వర్లును అనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు.
First published: April 24, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...