ఇద్దరు బాయ్‌ఫ్రెండ్‌తో ఒకేసారి... బాత్రూమ్‌కి వెళ్లిన యువతి కేకలు వేయడంతో...

విశాఖపట్నంలో థ్రిల్లర్ మూవీ లెవెల్ డ్రామా... ఇద్దరితో ప్రేమాయణం నడిపి ఒక్కడిని పెళ్లి చేసుకున్న యువతి... కక్ష కట్టి నూతన వధూవరులను కిడ్నాప్ చేసేందుకు యత్నించిన మాజీ లవర్... తెలివిగా కిడ్నాపర్ల నుంచి తప్పించుకున్న యువతి...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: May 11, 2019, 5:28 PM IST
ఇద్దరు బాయ్‌ఫ్రెండ్‌తో ఒకేసారి... బాత్రూమ్‌కి వెళ్లిన యువతి కేకలు వేయడంతో...
బాయ్‌ఫ్రెండ్‌తో ఒకేసారి... బాత్రూమ్‌కి వెళ్లిన యువతి కేకలు వేయడంతో...
  • Share this:
ఒకే యువకుడిని ప్రేమిస్తే కిక్ ఏముంది అనుకుందేమో... ఒకేసారి ఇద్దరితో ప్రేమాయణం నడిపిందో యువతి. ఒక బాయ్‌ఫ్రెండ్‌ పెళ్లికి నో అనడంతో, మరో లవర్‌ను పెళ్లి చేసుకుంది. దాంతో మోసపోయిన విషయం గ్రహించిన యువకుడు... ఆమెను, ఆమె భర్తను కిడ్నాప్ చేశాడు. స్థానికంగా సంచలనం క్రియేట్ చేసిన ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో వెలుగుచూసింది. పీఎం పాలేం గ్రామానికి చెందిన శివప్రసాద్ అనే యువకుడు ఓ కన్‌స్ట్రక్షన్ కంపెనీని స్థాపించాడు. ఈ కంపెనీలో మేనేజర్‌గా పనిచేసే 27 ఏళ్ల రేవతితో అతనికి సాన్నిహిత్యం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. ఇద్దరూ కలిసి పార్కులు, సినిమాలకు తిరిగేవారు. అయితే రేవతి, బాస్‌తో పాటు విజినిగిరిపాలేం గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం అనే యువకుడితో కూడా ప్రేమాయణం సాగించేది. ఒకరికి తెలియకుండా మరోకరితో ఇద్దరు బాయ్‌ఫ్రెండ్స్‌తో ప్రేమాయణం నడిపింది. పెళ్లి వయసు రావడంతో ముందుగా కంపెనీ ఎండీ అయిన శివప్రసాద్‌‌ను పెళ్లి చేసుకోవాలని కోరింది రేవతి. దానికి శివప్రసాద్ ఇంకా సమయం కావాలని కోరాడు. దానికి ఆగ్రహానికి లోనైన రేవతి, సుబ్రహ్మణ్యాన్ని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంది. ఇంటి నుంచి వెళ్లిపోతున్నట్టు లేఖ రాసి, సుబ్రహ్మణ్యంతో వెళ్లిపోయింది.

దాంతో తనను మోసం చేసిన రేవతిపై కక్ష పెంచుకున్నాడు శివప్రసాద్. తన ఆఫీసులోనే పనిచేస్తున్న రేవతి అన్న వెంకటసాయి సాయంతో రేవతినీ, ఆమె భర్త సుబ్రహ్మణ్యాన్ని కిడ్నాప్ చేయాలని పథకం పన్నారు. తన ఆఫీసులో నగలు, ల్యాప్‌టాప్ చోరీకి గురయ్యాయని, వాటిని రేవతియే అపహరించిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు పెద్దగా పట్టించుకోకపోవడంతో ఓ వాహనానికి ‘Police’ అనే స్టిక్కర్ అంటించి, కిరాయి మనుషులను రేవతి ఇంటికి పంపాడు శివప్రసాద్. విషయం తెలియని రేవతి, ఆమె భర్త వాహనం ఎక్కారు. ఆ తర్వాత వారి మాటతీరు, ప్రవర్తనతో అసలు విషయం గ్రహించిన రేవతి... వారి నుంచి తప్పించుకునేందుకు ప్లాన్ వేసింది. బాత్రూమ్‌కు వెళ్లాలని గోల చేసి పెట్రోల్ బంక్ దగ్గర ఆపాలని పట్టుబట్టింది. ఆమె మాటలు నమ్మిన వాళ్లు బండిని పెట్రోల్ బంక్ దగ్గర ఆపారు. బండి దిగి బాత్రూమ్‌కు వెళ్లిన రేవతి, ఆమె భర్త గడియ పెట్టుకుని కాపాడాలంటూ కేకలు వేశారు. స్థానికులు గుమిగూడడంతో రౌడీలు అక్కడి నుంచి పారిపోయారు. అక్కడి నుంచి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు రేవతి, సుబ్రహ్మణ్యం. కేసు నమోదుచేసుకున్న పోలీసులు... దర్యాప్తు చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కిడ్నాప్ పథకం రచించిన శివప్రసాద్, రేవతి అన్న వెంకటసాయిలను అరెస్ట్ చేసిన పోలీసులు... కిడ్నాప్ చేసిన వారి కోసం గాలిస్తున్నారు.

First published: May 11, 2019, 5:21 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading