డైపర్ మార్చడం గురించి గొడవ... నెల వయసు పసికందుపై తల్లిదండ్రుల దారుణం...

ఏడుస్తున్న బిడ్డపై దారుణంగా దాడి చేసిన తండ్రి... చిత్రహింసలు పెట్టి, నరకం చూపించిన 20 ఏళ్ల యువకుడు... చూస్తూ నిలబడిన తల్లి...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 5, 2019, 6:31 PM IST
డైపర్ మార్చడం గురించి గొడవ... నెల వయసు పసికందుపై తల్లిదండ్రుల దారుణం...
పతల్లిదండ్రులు... (నమూనా చిత్రం)
  • Share this:
రాక్షసులు కూడా తమ బిడ్డలను ప్రాణప్రదంగా చూసుకుంటారు. ఎవ్వరైనా వారికి హాని తలబెట్టాలని చూస్తే తల్లడిల్లిపోతారు. కానీ మనుషులు పుట్టిన వాళ్లు మాత్రం నెల వయసు కూడా నిండని చిన్నారిని అతిదారుణంగా కొట్టి చిత్రహింస చేశారు. డైపర్ మార్చడం గురించి గొడవ పడి, పసికందుకు నరకం చూపారు. యావత్ ప్రపంచం నివ్వెరపోయేలా చేసిన ఈ దారుణ అమానవీయ సంఘటన అమెరికాలోని టెక్సాస్‌లో జరిగింది. టెక్సాస్‌కు చెందిన 20 ఏళ్ల గేరీ లీ ఫ్యాక్స్‌, తన భార్యకు నెల రోజుల క్రితం ఓ మగబిడ్డ జన్మించాడు. బిడ్డను చూసుకోవడం విషయంలో భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఆఫీస్ నుంచి వచ్చిన గేరీ లీ ఫ్యాక్స్... పిల్లాడు ఏడుస్తుండడంతో అసహనానికి లోనయ్యాడు. డైపర్ మార్చడంటే భార్య అతన్ని విసుక్కుంది. దాంతో తీవ్ర ఆవేశానికి లోనైన గేరీ... నెల రోజుల పసికందు అనే కనీస ఆలోచన కూడా చిన్నారిని దారుణంగా కొట్టాడు. దెబ్బలకు తాళలేక పసివాడు ఏడుస్తుంటే... గేరీ కోసం మరింత పెరిగింది. ఆ కోపాన్నంతా బిడ్డపైనే చూపిన ఆ కసాయి తండ్రి... డైపర్ మార్చే సమయంలో మర్మాయవాలను పిసికేశాడు. కన్నబిడ్డపై భర్త దాడి చేస్తుంటే... భార్య చూస్తూ ఉండిపోయింది కానీ కనీసం ఆపేందుకు కూడా ప్రయత్నించలేదు. కోపం చల్లారిన తర్వాత కొనఊపిరితో ఉన్న పసికందును తీసుకుని ఆసుపత్రికి వెళ్లారు గేరీ, అతని భార్య.

చిన్నారి పరిస్థితి చూసి ఆసుపత్రి వైద్యులు చలించిపోయారు. నర్సులు పసికందును చూడగానే ఏడ్చేశారు. ఎంత ఘోరమైన ప్రమాదానికి గురైన ఇంత దారుణంగా గాయాలు కావు అని నిర్ణయించుకున్న వాళ్లు... పోలీసులకు ఫిర్యాదు చేశారు. తండ్రి దాడి కారణంగా పసికందు పుర్రెలో మెదడు చిట్లింది, శరీరం లోపల చాలాచోట్ల రక్తస్రావం అయినట్టు తేలింది. ఛాతిపై బలంగా కొట్టడం వల్ల పక్కటెముకలు విరిగిపోయాయి. మర్మాంగాలు కూడా దెబ్బతిన్నాయి. కేసు నమోదుచేసిన పోలీసులు... విచారణ చేయగా తండ్రి చేసిన దారుణం వెలుగులోకి వచ్చింది. గేరీతో పాటు భర్త పసిబిడ్డపై అంత దారుణంగా దాడికి పాల్పడుతున్నా చూస్తూ నిలబడిన అతని భార్యను కూడా అరెస్ట్ చేశారు పోలీసులు.

First published: April 5, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading