అల్లరి చేస్తున్నారని విద్యార్థులను నగ్నంగా నిల్చోబెట్టిన టీచర్... రోజంతా...

ఎంత చెప్పినా, వినకుండా అల్లరి చేస్తున్నారనే కోపంతో చిన్నారులను ఇష్టంవచ్చినట్టు కొట్టి, క్లాస్ బయట నగ్నంగా నిల్చెబట్టిన టీచర్... ఉదయం నుంచి సాయంత్రం దాకా అలా నిల్చోవడంతో అలసిపోయిన విద్యార్థులు...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 10, 2019, 5:07 PM IST
అల్లరి చేస్తున్నారని విద్యార్థులను నగ్నంగా నిల్చోబెట్టిన టీచర్...  రోజంతా...
విద్యార్థులను నగ్నంగా నిల్చోబెట్టిన టీచర్... అల్లరి చేస్తున్నారని రోజంతా... (నమూనా చిత్రం)
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 10, 2019, 5:07 PM IST
ఎంతో పవిత్రంగా నిర్వహించిన టీచర్ వృత్తి, రోజురోజుకీ అపహాస్యమవుతోంది. కొన్నిరోజుల కిందట విద్యార్థులతో శృంగారం చేస్తూ కొందరు టీచర్లు దొరకడం సంచలనం క్రియేట్ చేయగా... తాజాగా ఓ టీచర్, అల్లరి చేస్తున్నారని చెప్పి విద్యార్థులను నగ్నంగా నిల్చెబట్టింది. వీరంతా శారీరకంగా దృఢంగా ఉన్నవారో, కావాలని అల్లరి చేస్తున్న విద్యార్థులో కాదు... అందరూ నాలుగేళ్ల, ఐదేళ్ల చిన్నారులే. స్థానికంగా సంచలనం క్రియేట్ చేసిన ఈ సంఘటన ఇల్లినాయిస్ ఏరియాలో జరిగింది. ఓ ప్రైమర స్కూల్‌లో టీచర్‌గా విధులు నిర్వహించిన ఓ మహిళ... చిన్నపిల్లలను ఆడిస్తూ, రెయిమ్స్ నేర్పిస్తూ ఉండేది. అయితే ఇష్టం లేని ఉద్యోగం చేస్తున్న ఆమె, తన అసహనాన్ని పిల్లలపై చూపించేది. కోపంతో పిల్లల వీపులు వాయించేది. తాజాగా ఎంత చెప్పినా, వినకుండా అల్లరి చేస్తున్నారనే కోపంతో ఊగిపోయిన సదరు టీచర్... చిన్నారులను ఇష్టంవచ్చినట్టు కొట్టింది. అయినా ఆమె కోపం ఏ మాత్రం తగ్గకపోవడంతో పిల్లల బట్టలు విప్పించి, నగ్నంగా క్లాసు బయట నిల్చోబెట్టింది. ఉదయం నుంచి సాయంత్రం స్కూల్ అయిపోయేదాకా ఇదే పనిష్మెంట్ అమలు చేసింది ఆ టీచర్.

ఉదయం నుంచి సాయంత్రం దాకా నగ్నంగా నిలబడిన చిన్నారులు... ఇంటికి వెళ్లేసరికి నీరసంతో పడిపోయారు. ఏం జరిగిందని ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పసిపిల్లలతో ఎలా ఉండాలో తెలియని వ్యక్తిని టీచర్‌గా ఎలా నియమించారంటూ స్కూల్ యాజమాన్యాన్ని నిలదీశారు చిన్నారుల తల్లిదండ్రులు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో విషయం తెలుసుకున్న స్కూల్ యాజమాన్యం సదరు టీచర్‌ను, ఆమెకు సాయంగా ఉన్న అసిస్టెంట్‌ను సస్పెండ్ చేసింది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఈ ఇద్దరిపై కేసు నమోదుచేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.


First published: April 10, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...