SHOCKING INCIDENT HAS COME TO LIGHT IN CHAKGHAT POLICE THANE AREA OF RIVA DISTRICT SSR
Shocking Incident: కూతురితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఆమె ప్రియుడు రోజూ ఆమె కోసం ఇంటికొస్తున్నాడని..
పోలీసుల అదుపులో వివాహిత తండ్రి
వివాహేతర సంబంధాలు చివరకు విషాదాంతాలను మిగుల్చుతాయన్న సంగతి తెలిసినా కొందరి తీరు మారడం లేదు. ఫలితంగా బంగారం లాంటి జీవితాలను చేజేతులా నాశనం చేసుకుంటున్నారు.
రెవ: వివాహేతర సంబంధాలు చివరకు విషాదాంతాలను మిగుల్చుతాయన్న సంగతి తెలిసినా కొందరి తీరు మారడం లేదు. ఫలితంగా బంగారం లాంటి జీవితాలను చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. లేదా.. అయినవాళ్ల చేతుల్లోనే దాడులకు గురవుతున్నారు. అలాంటి ఘటనే మధ్యప్రదేశ్లోని రెవ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రెవ జిల్లాలోని ఛక్ఘట్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత సోమవారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ యువతిపై ఆమె కన్న తండ్రి కిరోసిన్ పోసి నిప్పంటించాడు. ఆమె మంటలకు తాళలేక బాధతో అరుపులు, కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వాళ్లు వచ్చి ఆమెను రెవలోని సంజయ్ గాంధీ హాస్పిటల్కు తరలించారు.
ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కన్నతండ్రి ఇంత దారుణానికి పాల్పడటానికి వెనుక ఉన్న కారణం తెలిసి పోలీసులు విస్తుపోయారు. నిందితుడి కూతురు.. భర్తతో మనస్పర్థలు రావడంతో అతనితో తెగతెంపులు చేసుకుంది. అప్పటి నుంచి పుట్టింటికి వచ్చి తండ్రితో పాటే ఉంటోంది. ఆమె తల్లి చనిపోయింది. దీంతో.. వివాహిత, ఆమె తండ్రి మాత్రమే ఇంట్లో ఉంటున్నారు. అయితే.. భర్తకు దూరమైన ఈమెకు ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది.
ఆ యువకుడు రోజూ ఇంటికి వస్తూ ఉండేవాడు. ఈ పరిణామం వివాహిత తండ్రిని తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. కూతురి ప్రియుడు రోజూ ఇంటికి వస్తూపోతుండటాన్ని సహించలేకపోయిన ఆమె తండ్రి కూతురికి పలుమార్లు చెప్పి చూశాడు. అతను మళ్లీ మన ఇంటి వైపు వస్తే బాగుండదని కూతురిని హెచ్చరించాడు. అయినప్పటికీ తండ్రి హెచ్చరికను కూతురు పెద్దగా పట్టించుకోలేదు.
ఈ క్రమంలో.. గత సోమవారం కూడా ఆమె ప్రియుడు ఇంటికి వచ్చి వెళ్లాడు. దీంతో.. కోపంతో ఊగిపోయిన వివాహిత తండ్రి కూతురితో గొడవకు దిగాడు. ఎన్నిసార్లు చెప్పినా పద్ధతి మార్చుకోవేంటంటూ కూతురిని తిట్టాడు. ఇద్దరి మధ్య గొడవ జరిగింది. మాటామాటా పెరిగింది. గొడవ చిలికిచిలికి గాలివానగా మారడంతో వివాహిత తండ్రి ఆగ్రహంతో ఊగిపోతూ కిరోసిన్ తీసుకొచ్చి కూతురిపై పోసి అగ్గిపుల్ల గీసి నిప్పంటించాడు. మంటల్లో కాలిపోతూ ఆమె కేకలేయడంతో ఇరుగుపొరుగు వారు వచ్చి ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. పోలీసులు ఈ కేసులో వివాహిత తండ్రిని అరెస్ట్ చేశారు. వివాహేతర సంబంధాలు.. తదనంతర పరిణామాలు ఎలాంటి అనర్ధాలకు దారితీస్తాయో ఈ ఘటన చెప్పకనే చెబుతోంది.
Published by:Sambasiva Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.