Bangalore: బెంగళూరులో దారుణ ఘటన.. ఉదయం 6 గంటలకు డ్యూటీకి వెళ్లేందుకు రెడీ అవుతున్న యువతిని..

ప్రతీకాత్మక చిత్రం

కర్ణాటక రాజధాని నగరం బెంగళూరులో దారుణం జరిగింది. తాను ప్రేమించిన యువతి పెళ్లికి ఒప్పుకోలేదని ఆమె గొంతు కోసిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో ఆ యువతి ప్రాణాలు కోల్పోయింది.

  • Share this:
    బెంగళూరు: కర్ణాటక రాజధాని నగరం బెంగళూరులో దారుణం జరిగింది. తాను ప్రేమించిన యువతి పెళ్లికి ఒప్పుకోలేదని ఆమె గొంతు కోసిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో ఆ యువతి ప్రాణాలు కోల్పోయింది. ఆ హత్య చేసిన నిందితుడు కూడా విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన రెండు కుటుంబాల్లో పెను విషాదం నింపింది.

    ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెంగళూరులోని హోస్కోటే దగ్గరలో ఉన్న ఫ్లిప్‌కార్ట్ కంపెనీలో గోపాలకృష్ణ (32), ఉష (24) పనిచేస్తున్నారు. గోపాలకృష్ణ సెక్యూరిటీ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ఉష సెక్యురిటీ గార్డుగా పనిచేస్తోంది. ఆమెకు ఆ ఉద్యోగం ఇప్పించే విషయంలో గోపాలకృష్ణ సాయం చేశాడు. ఆ వంకను అడ్డం పెట్టుకుని ఆమెకు ఇష్టం లేదని చెప్పినా ఆమెను ప్రేమ పేరుతో వేధించేవాడు.

    ఇది కూడా చదవండి: Love Marriage: పెద్దలు ఒప్పుకోకపోవడంతో అన్నవరంలో ప్రేమ పెళ్లి.. కానీ దురదృష్టం ఏంటంటే...

    స్నేహంగా ఉందామని, ప్రేమ లాంటివి వద్దని ఉష చెప్పింది. ఆమెతో సరే అని గోపాలకృష్ణ చెప్పినప్పటికీ ఉషపై రోజురోజుకూ ప్రేమను పెంచుకున్నాడు. ఆమె ముందు మాత్రం స్నేహంగా ఉన్నట్లు నటించేవాడు. అయితే.. ఇలా కొన్ని నెలలు గడిచాక గోపాలకృష్ణ ఆమెను ప్రేమిస్తున్న విషయం ఉషకు తెలిసింది. దీంతో.. ఆమె అతనికి దూరంగా పెట్టింది. ఉషకు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూశారు. ఇటీవలే ఆమెకు నిశ్చితార్థం కూడా జరిగింది. అంతేకాదు.. తననే పెళ్లి చేసుకోవాలంటూ గోపాలకృష్ణ నుంచి వేధింపులు పెరిగిపోవడంతో ఉష ఫ్లిప్‌కార్ట్‌లో ఉద్యోగం మానేసి వేరే కంపెనీలో చేరింది. గోపాలకృష్ణకు ఈ విషయం తెలిసి ఆమె ఉంటున్న ఇంటి వద్దకు ఉదయం ఆరు గంటలకు వెళ్లాడు. మాట్లాడాలని చెప్పి ఉష ఇంటికి వెళ్లాడు.

    ఇది కూడా చదవండి: Youtube: యూట్యూబ్‌లో ప్రసవం వీడియోలు చూసి బిడ్డకు జన్మనిచ్చిన 17 ఏళ్ల బాలిక.. షాకింగ్ నిజం ఏంటంటే..

    ఉష అప్పుడే డ్యూటీకి వెళ్లేందుకు యూనిఫాం వేసుకుని రెడీ అయింది. ఆ సమయంలో వెళ్లిన గోపాలకృష్ణ ఆమె ఇంటికి వెళ్లి తననే పెళ్లి చేసుకోవాలంటూ ఆమెతో గొడవ పడ్డాడు. ఈ గొడవ కారణంగా ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇద్దరి మధ్య ఘర్షణ చిలికిచిలికి గాలివానగా మారింది. క్షణికావేశంలో గోపాలకృష్ణ ఆమెను హత్య చేశాడు. వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు. పోలీసులు నిందితుడు కోసం వెతుకులాట సాగించగా.. ఉష ఉంటున్న ఇంటికి సరిగ్గా 10 కిలోమీటర్ల దూరంలో గోపాలకృష్ణ మృతదేహం కనిపించింది. విషం తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు విచారణలో తేలింది. ఉష మరొకరిని పెళ్లి చేసుకోనుందన్న కారణంగా గోపాలకృష్ణ ఈ హత్య చేసినట్లు ప్రాథమిక విచారణలో పోలీసులు తేల్చారు.
    Published by:Sambasiva Reddy
    First published: