Shocking Incident: అయ్యో పాపం.. ఈ అమ్మాయి.. కాలేజీ నుంచి అన్నయ్య బైక్‌పై తిరిగొస్తుంటే ఇతనొచ్చి...

పూనమ్, రోహిత్

మధ్యప్రదేశ్‌లో ఘోరం జరిగింది. ప్రేమోన్మాదం ఓ యువతి నిండు జీవితాన్ని బలి తీసుకుంది. కాలేజీకి వెళ్లొస్తున్న యువతిని ఓ సైకో లవర్ కాల్చి చంపాడు. ఆ తర్వాత అక్కడ నుంచి పారిపోయాడు. ఈ అమానుష ఘటన మధ్యప్రదేశ్‌లోని సాగర్‌లో ఉన్న మోతీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

  • Share this:
    సాగర్: మధ్యప్రదేశ్‌లో ఘోరం జరిగింది. ప్రేమోన్మాదం ఓ యువతి నిండు జీవితాన్ని బలి తీసుకుంది. కాలేజీకి వెళ్లొస్తున్న యువతిని ఓ సైకో లవర్ కాల్చి చంపాడు. ఆ తర్వాత అక్కడ నుంచి పారిపోయాడు. ఈ అమానుష ఘటన మధ్యప్రదేశ్‌లోని సాగర్‌లో ఉన్న మోతీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. పూనమ్ అనే యువతి కాలేజీలో చదువుకుంటోంది. ఆమెను అదే ప్రాంతానికి చెందిన రోహిత్ అనే యువకుడు కొంత కాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. రోహిత్‌ బైక్ మెకానిక్ పనిచేస్తూ ఆటో‌మొబైల్స్ పార్ట్స్ షాప్‌ను నడుపుతున్నాడు. రోహిత్ పూనమ్‌ను చూసి ఇష్టపడ్డాడు. ఆమెను ప్రేమించాడు. ఈ విషయాన్ని ఆమెకు చెప్పగా తనకు ఇష్టం లేదని చెప్పింది.

    అంతటితో వదిలేయకుండా రోహిత్ ఆమె వెంటపడుతూ ప్రేమ పేరుతో వేధించసాగాడు. తననే ప్రేమించాలని లేకపోతే చంపేస్తానని బెదిరించసాగాడు. నాలుగు నెలల క్రితం అన్నంత పని చేయబోయాడు. పూనమ్ బయటకు వెళ్లి తిరిగి ఇంటికి వెళుతుండగా ఆమెను అడ్డగించి చేయి కోసి పారిపోయాడు. అదృష్టవశాత్తూ ఆ ఘటనలో పూనమ్ కోలుకుంది. ఆ సమయంలో పూనమ్ కుటుంబం రోహిత్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.

    ఇటీవల బెయిల్‌పై రోహిత్ విడుదలయ్యాడు. తనను ప్రేమించలేదన్న కోపమో లేక జైలుకు పంపారన్న విషయాన్ని మనసులో పెట్టుకున్నాడో గానీ రోహిత్ బుద్ధి మారలేదు. రోహిత్ అలా చేసినప్పటి నుంచి పూనమ్‌‌ను ఇంట్లో వాళ్లు ఒంటరిగా బయటకు పంపడం లేదు. ఆమె అన్నయ్యే రోజూ కాలేజీలో దించి, తిరిగి ఇంటికి బైక్‌పై తీసుకొస్తున్నాడు. అలాగే.. గురువారం సాయంత్రం పూనమ్‌ తన అన్నయ్య బైక్‌పై కాలేజీకి వెళ్లి వస్తోంది. సరిగ్గా.. ఇంటికి కొద్ది దూరంలో రోహిత్ వీళ్ల బైక్‌ను అడ్డగించాడు. పూనమ్‌ను నోటికొచ్చినట్టు తిట్టడం మొదలుపెట్టాడు. దీంతో.. కోపంతో ఆమె అన్నయ్య రోహిత్‌ను కొట్టబోయాడు. అయితే.. అప్పటికే తన వెంట తెచ్చుకున్న తుపాకీతో పూనమ్ అన్నయ్యపై రోహిత్ దాడి చేశాడు. తుపాకీని వెనుకకు తిప్పి తలపై కొట్టడంతో ఆమె అన్నయ్య స్పృహ కోల్పోయాడు.

    ఇది కూడా చదవండి: Wife Busy On Phone: భార్య ఎప్పుడు చూసినా ఫోన్‌లో బిజీగా ఉంటోందని ఈ భర్త ఏం చేశాడో చూడండి..

    కూతురు, కొడుకూ ఇంకా రాలేదని బయటికొచ్చి చూసేసరికి ఈ గొడవ కనిపించేసరికి.. కూతురిని కాపాడుకోవాలని పూనమ్ తల్లి కూడా అక్కడికి వచ్చింది. ఆమెపై కూడా తుపాకీని వెనుకకు తిప్పి కొడుతూ రోహిత్ దాడి చేశాడు. ఆ తర్వాత అదే తుపాకీతో పూనమ్‌ కడుపులో కాల్చి అక్కడి నుంచి పారిపోయాడు. ఆ తుపాకీని కూడా అక్కడే పడేసి వెళ్లిపోయాడు. కడుపులో బుల్లెట్ దిగడంతో తీవ్ర రక్తస్రావమై రక్తపుమడుగులో పడి ఉన్న పూనమ్‌ను ఆమె సోదరుడు, తల్లి ఆసుపత్రికి తరలించారు. అయితే.. ఆమె చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటన గురించి పోలీసులకు పూనమ్ కుటుంబ సభ్యులు సమాచారం అందించారు. పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనలో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
    Published by:Sambasiva Reddy
    First published: