9 నెలల చిన్నారి కడుపులో మరో బిడ్డ... పుట్టిన రెండు వారాల తర్వాత...

బిడ్డ లోపల మరో బిడ్డ పెరగడం మొదలైన 35 వారాలకు ఆ విషయాన్ని గుర్తించిన డాక్టర్లు... లాపరోస్కోపీ సర్జరీ ద్వారా బిడ్డ లోపలి నవశిశువు తొలగింపు...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: March 31, 2019, 8:41 PM IST
9 నెలల చిన్నారి కడుపులో మరో బిడ్డ... పుట్టిన రెండు వారాల తర్వాత...
9 నెలల చిన్నారి కడుపులో మరో బిడ్డ... పుట్టిన తర్వాత రెండు వారాలకు...
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: March 31, 2019, 8:41 PM IST
చిన్నారి జన్మించి కేవలం 9 నెలలే అవుతోంది. అయితే పుట్టినప్పటి నుంచి తీవ్రమైన అనారోగ్యానికి గురి అవుతూ ఉండడంతో కంగారు పడిన తల్లిదండ్రులు... ఆసుపత్రికి తీసుకెళ్లారు. శిశువును పరీక్షించిన వైద్యులు... రిపోర్టులు చూసి షాక్‌కు గురయ్యాడు. పసికందు కడుపులో మరో శిశువు పెరుగుతోందని తెలిసి, షాక్‌కు గురయ్యాడు. అమెరికాలోని కొలంబియాలో వెలుగుచూసిందీ విచిత్ర సంఘటన. 37 వారాల క్రితం జన్మించిన ఓ చిన్నారి... పుట్టినప్పటి నుంచి తరుచూ అనారోగ్యానికి గురవుతోంది. వైద్యులకు చూపించగా ఆడ శిశువు పేగు భాగంలో మరో శిశువు ప్రాణం పోసుకుంటోందని తెలిసింది. పాప పుట్టిన రెండు వారాల నుంచే ఆమె పేగుల్లో మరో శిశువు పెరగడం మొదలయ్యిందని నిర్ధారించారు. బిడ్డ లోపల మరో బిడ్డ పెరగడం మొదలైన 35 వారాలకు ఆ విషయాన్ని గుర్తించారు డాక్టర్లు. అయితే శిశువు పేగుల్లో రోజురోజుకీ బిడ్డ పెరుగుతుండడంతో చిన్నారి ప్రాణాలకు ప్రమాదం అని గుర్తించిన డాక్టర్లు... లాపరోస్కోపీ సర్జరీ చేసి లోపలి బిడ్డను తీసేశారు.

సాధారణంగా అయితే కడుపులో బిడ్డ పూర్తిగా రూపాంతరం చెందేందుకు 9 నెలల కాలం పడుతుంది. అయితే తల్లిపాలు మాత్రమే తాగుతున్న నవశిశువు పేగుల్లో బిడ్డ రూపాంతరం చెందడం వల్ల లోపలి బిడ్డకు గుండె, మెదడు ఇంకా అభివృద్ధి చెందలేదు. బిడ్డను అలాగే ఉంచితే చిన్నారి ఎముకలు, లోపలి భాగాలు విరిగిపోయే ప్రమాదం ఉందని గ్రహించి... లోపలి శిశువును తీసేశారు వైద్యులు. చిన్నారి తల్లికి కవల పిల్లలు పుట్టాల్సిందని, అయితే కణాల మధ్య సమతౌల్యం లోపించడం వల్ల చిన్నారి శరీరంలో బిడ్డ రూపాంతరం చెందిందని, ఇలాంటి ఘటనలు అతి అరుదుగా జరుగుతుంటాయని తెలిపారు వైద్యులు.

First published: March 31, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...