బెడ్‌రూమ్‌లో సీక్రెట్ కెమెరాలు పెట్టి... 800 మంది దంపతుల శృంగారం రికార్డ్...

దేశంలోని 10 నగరాల్లో 30 హోటళ్లలో వెలుగుచూసిన 40 స్పై కెమెరాలు... వీడియోలు పెట్టేందుకు ప్రత్యేకంగా వెబ్‌సైట్ రూపకల్పన... వీడియోలు వీక్షకుల నుంచి భారీగా ఛార్జి వసూలు...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: March 22, 2019, 1:45 PM IST
బెడ్‌రూమ్‌లో సీక్రెట్ కెమెరాలు పెట్టి... 800 మంది దంపతుల శృంగారం రికార్డ్...
(నమూనా చిత్రం)
  • Share this:
హైదరాబాద్, చెన్నైలలోని లేడీస్ హాస్టల్‌లో వెలుగుచూసిన సీక్రెట్ కెమెరాల స్కాండిల్‌కు మించి భారీ స్కామ్ దక్షిణ కొరియాలో వెలుగు చూసింది. హోటల్‌ గదుల్లో రహస్యంగా కెమెరాలు ఏర్పాటు చేసి...ఏకంగా 800 మంది సెక్స్ వీడియోలను రికార్డు చేసిందో ముఠా. ఆ వీడియోలను పెట్టేందుకు ఓ వెబ్‌సైట్ కూడా ఏర్పాటు చేశాయి. సదరు వెబ్‌సైట్‌‌లో జంటల శృంగార వీడియోలను లైవ్ టెలికాస్ట్ చేయడం విశేషం. దక్షిణ కొరియాలోని పది నగరాల్లో ఉన్న 30 హోటళ్లలో అమర్చిన స్పై కెమెరాలను చూసి షాక్ అయ్యారు. సౌత్ కొరియాలోని కొన్ని హోటళ్లలో తక్కువ ధరకే గదులు లభిస్తాయి. దాంతో ఆ దేశానికి వెళ్లిన విదేశీయులతో పాటు పనుల నిమిత్తం వివిధ ప్రాంతాలకు ప్రయాణం చేసేవారు కూడా ఇలాంటి హోటళ్లలో గదులు తీసుకునేందుకు ప్రాధాన్యం ఇస్తారు. దీన్ని అవకాశంగా మలుచుకున్న ఓ ముఠా... పోర్న్ వీడియోలు చిత్రీకరించేందుకు భారీ పథకం పన్నింది. దేశంలోని 10 నగరాల్లో 30 హోటళ్లలో ముందుగా గదులు తీసుకుంటుందీ ముఠా. టీవీ బాక్సులు, వాల్ సాకెట్లలో, హెయిర్ డ్రెయ్యిర్ హోల్డర్స్, ఫ్యాన్స్... ఇలా గుర్తించడానికి వీలు లేకుండా స్పైకామ్‌లు అమరుస్తుంది.

ఇలా 40 గదుల్లో రహస్య కెమెరాలను అమర్చారు. ఆ గదుల్లో దిగిన అతిథులు శృంగారంలో పాల్గొన్న, బట్టలు మార్చుకుంటున్నా ఆ దృశ్యాలన్నీ ఓ వెబ్‌సైట్‌లో ప్రత్యక్ష ప్రసారం చేసేవారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ వెబ్‌సైట్ రూపొందించారు. ఈ వెబ్‌సైట్‌లో సెక్స్ వీడియోలు చూడాలంటే ప్రత్యేకంగా రుసుము చెల్లించాల్సి ఉంటుంది. వీక్షకుల నుంచి వీడియోకు ఇంత చెప్పున భారీ మొత్తంలో వసూలు చేస్తోందీ ముఠా. ఇలా దాదాపు 800 మంది స్వదేశీ, విదేశీయుల శృంగార వీడియోలు రికార్డు చేసినట్టు తేలింది. గత ఏడాది నవంబర్ నుంచి జరుగుతున్న ఈ స్పైకామ్ సెక్స్ స్కాండిల్... విచిత్రంగా వెలుగులోకి రావడం విశేషం. ఓ హెటల్ గదిలో దిగిన ఓ ప్రేమజంట... శృంగారంలో పాల్గొంటూ సదరు వెబ్‌సైట్‌లో వీడియోలు చూడాలని భావించారు. అందులో తామే కనిపించడంతో అవాక్కై, పోలీసులకు ఫిర్యాదు చేశారు. దక్షిణ కొరియాలోని హోటళ్లలో ఇలాంటి స్పై కెమెరాలు వెలుగుచూడడం కొత్తేమీ కాదు గానీ ఆన్‌లైన్‌లో లైవ్ టెలికాస్టింగ్ మాత్రం ఇదే మొదటిసారి.

First published: March 22, 2019, 1:44 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading