Home /News /crime /

SHOCKING GURUGRAM WOMAN JUMPS TO DEATH FROM RAJIV CHOWK FLYOVER PAH

Shocking: పట్టపగలు అందరు చూస్తుండగానే ఫ్లై ఓవర్ పై నుంచి దూకేసిన యువతి..

ఘటన జరిగిన ప్రదేశం

ఘటన జరిగిన ప్రదేశం

Uttar Pradesh: ఒక యువతి పట్టపగలే దారుణానికి ఒడిగట్టింది. ఎంతో ఆనందంగా గడపాల్సిన జీవితాన్ని అర్ధాంతరంగా ముగించింది. కన్న వాళ్లకు తీరని శోకాన్ని మిగిల్చింది.

Uttar Pradesh: హార్యానాలో ఘోరమైన సంఘటన జరిగింది. ఒక యువతి పట్టపగలే అఘాయిత్యానికి పూనుకుంది. నిండు నూరేళ్ల జీవితాన్ని అర్ధంతరంగా ముగించేసింది. కన్నవాళ్ల ను తీరని శోకాన్ని మిగిల్చింది. ఈ సంఘటన శనివారం మధ్యాహ్నాం చోటు చేసుకుంది. ఒక యువతి తన స్కూటీపై రాజీవ్ చౌక్ ఫ్లైఓవర్ మీదికి చేరుకుంది. ఆ తర్వాత.. అక్కడ నుంచి అమాంతం దూకేసింది. ప్రస్తుతం సమాజంలో ప్రతి ఒక్కరు.. క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకుంటున్నారు. తల్లిదండ్రులు ఇష్టమైన వస్తువు కొనివ్వలేదనో.. లేక ప్రియుడు, ప్రియురాలు.. తన ప్రేమను నిరాకరించారని నేటి యువత బలవన్మారణాలకు పాల్పడుతున్నారు.

కొన్నిచోట్ల వైవాహిక జీవితంతో ఏదో చిన్న పాటి గొడవల వలన ఏకంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కొందరు పరీక్షలలో తప్పామని, ఉద్యోగం రాలేదని సూసైడ్ లు చేసుకుంటున్నారు. తమ కుటుంబానికి ఎనలేని దుఖం మిగుల్చుతున్నారు. ప్రతి రోజు ఇలాంటి ఘటనలు వార్తలలో వస్తున్నాయి. తాజాగా, ఒక యువతి ఫైఓవర్ పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. వెంటనే ఆ యువతి తలపగిలి.. రక్తం పారింది. ఈ సంఘటనతో రోడ్డుపై ఉన్న ప్రయాణికులు.. షాకింగ్ కు గురయ్యారు.





యూపీ పోలీసులు తెలిపిన వివరాలు.. శనివారం మధ్యాహ్నం ఒక యువతి స్కూటీపై రాజీవ్ చౌక్ ఫ్లై ఓవర్ చేరుకుంది. ఆ తర్వాత.. స్కూటీ పక్కన పార్క్ చేసింది. ఒక్కసారిగా కిందకు జంప్ చేసింది. రోడ్డుపై ప్రయాణిస్తున్న వారు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఏదో ప్రమాదవశాత్తు పడిందనుకున్నారు. వెంటనే యువతిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.

యువతిని పరిశీలించిన వైద్యులు అప్పటికే , ఆమె చనిపోయినట్లు నిర్ధారించారు. యువతి దగ్గర ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదు. ఈ క్రమంలో పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు విచారణలో యువతి.. యువతి ఆత్మహత్యకు పాల్పడిందని తేలింది. కానీ సూసైడ్ కు గల కారణాలు తెలియరాలేదు. బాధిత కుటుంబాన్ని పోలీసులు విచారిస్తున్నారు. ఈ ఘటనతో ఒక్కసారిగా తీవ్ర విషాదం నెలకొంది.
Published by:Paresh Inamdar
First published:

Tags: Crime news, Uttar pradesh, Woman suicide

తదుపరి వార్తలు