బ్రా లోపల బంగారు బిస్కెట్లు... ఎయిర్‌పోర్ట్ అధికారులకు షాక్ ఇచ్చిన థాయ్ మహిళ...

చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో థాయ్ మహిళ అరెస్ట్... రూ.47 లక్షల విలువైన బంగారాన్ని తరలించేందుకు లోదుస్తుల్లో దాచిన మహిళ

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: March 29, 2019, 10:06 PM IST
బ్రా లోపల బంగారు బిస్కెట్లు... ఎయిర్‌పోర్ట్ అధికారులకు షాక్ ఇచ్చిన థాయ్ మహిళ...
బ్రా లోపల బంగారు బిస్కెట్లు... ఎయిర్‌పోర్ట్ అధికారులకు షాక్ ఇచ్చిన థాయ్ మహిళ...
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: March 29, 2019, 10:06 PM IST
బంగారం స్మగ్లింగ్ చేసేందుకు ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలో... అన్ని రకాల ప్రయోగాలు చేస్తున్నారు స్మగర్లు. తాజాగా విదేశాల నుంచి పేస్ట్ రూపంలో బంగారం తీసుకొచ్చిన సంఘటన సంచలనం క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ యువతి లో దుస్తుల లోపల బంగారం దాచుకుని, స్మగ్లింగ్ చేసేందుకు ప్రయత్నించింది. థాయిలాండ్ దేశానికి చెందిన 38 ఏళ్ల క్రైసోర్న్ థాంప్రకోస్ అనే మహిళ... బోయింగ్ 337 విమానంలో చెన్నై చేరింది. చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో దిగిన తర్వాత ఆమె ప్రవర్తన కాస్త వింతగా ఉండడంతో కస్టమ్స్ అధికారులకు అనుమానం వచ్చింది. వెంటనే ఆమెను తీసుకెళ్లి తనిఖీ చేయగా... లో దుస్తుల్లో 1.4 కిలోల బంగారు బిస్కెట్లు కనిపించాయి. దాదాపు రూ.47 లక్షల విలువైన బంగారాన్ని అక్రమం తరలించేందుకు బ్రా కింద పెట్టుకుని వచ్చింది థాంప్రకోస్. ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు... విచారణ చేస్తున్నారు. కొన్నిరోజుల క్రితం చెన్నై ఎయిర్‌పోర్ట్‌లోనే ఓ మహిళ అండర్‌వేర్‌లో రూ. 12 లక్షల విలువైన 365 గ్రాముల బంగారాన్ని పెట్టుకుని తరలిస్తూ పట్టుబడడం సంచలనం క్రియేట్ చేసింది.
First published: March 29, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...