Romance In Flight: విమానంలో హద్దుమీరిన జంట.. పాడుపని చేస్తూ.. వీడియో వైరల్..

విమానంలో ఓ జంట

Romance In Flight: విమానంలో ప్రయాణించాలంటే కొన్ని నిబంధనలు పాటించాలి. అందులో ముఖ్యమైనది పక్కన ఉండే ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కల్పించకూడదు. అదే సమయంలో విమాన సిబ్బంది మాటలను ఖచ్చితంగా ఫాలోకావాలి. కానీ ఇక్కడ జరిగింది మాత్రం వేరు. అందరూ ప్రయాణిస్తున్న విమానంలోనే వాళ్ళు రొమాన్స్ మొదలుపెట్టారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

 • Share this:
  విమానం(Flight)లో ప్రయాణించే ప్రతీ ఒక్క ప్యాసింజర్(Passenger) కు విమానయాన శాఖకు సంబంధించిన నియమాలు కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ఇందులో.. వారు ప్రయాణించే సమయంలో ఏర్పాటు చేసే సెక్యూరిటీ (Security) నుండి ఫ్లైట్స్‌లో సేఫ్టీ(Safty) వరకు అనేక సూచనలు ఇవ్వబడతాయి. అయితే కొంత మంది ఇవన్నీ పట్టించుకోకుండా తమ పనిలో మునిగిపోతుంటారు. ఫ్లైట్ అని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ.. నిబంధనలు బేఖాతరు చేస్తారు. ఇలా ఓ అసభ్యకరమైన సంఘటనకు సంబంధించి వీడియో ఇప్పుడు సోషల్ మీడియలో వైరల్ గా మారింది. ఐరిష్ ఫ్లైట్ ర్యానయిర్ లో ఓ జంట అసభ్యకరంగా గడిపారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  Five in the world: ఇప్పటి వరకు ప్రపంచంలో ఐదుగురికి మాత్రమే ఇలా జరిగింది.. అదేంటో తెలుసా..


  ర్యానయిర్ అనేది ఐర్లాండ్‌ దేశంలో విమాన సర్వీసుకు సంబంధించినది. దీనిలో ప్రయాణం చేయాలంటే సామాన్య ప్రజలు కూడా చేయవచ్చు. కారణం ఏంటంటే.. ఆ ఫ్టైట్ లో జర్నీ చేసేందుకు విమాన టికెట్ ఖరీదు తక్కువగా ఉంటుంది. అయితే ఆ ఫ్లైట్ లో జరిగిన ఓ ఘటనకు సంబంధించి వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది. దానిని చూసిన ప్రతీ ఒక్కరు ఇదేం పాడు పని అంటూ వారిపై విరుచుకుపడుతున్నారు. అసభ్యకరంగా ముద్దులు పెట్టుకుంటూ.. ఫ్లైట్ లో తోటి ప్రయాణికులు ఉన్నారన్న సోయి మరిచి మరీ కామంలో మునిగిపోయారు. వాళ్ల సీట్లపై కూర్చొని ఇష్టం వచ్చినట్లు గడిపారు.

  Sexual Health: వయసు పెరిగాక మహిళల్లో శృంగార కోరికలు ఎందుకు తగ్గుతాయి..? పునరుత్తేజం పొందాలంటే ఏం చేయాలి..


  ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. ఆ పని ఏంటి అని ఇతరులు చెప్పాల్సింది పోయి.. వాళ్లు చేసే ఆ పనిని వీడియోలు తీస్తూ.. అక్కడేదో సినిమా జరుగుతున్నట్లు కెమెరాలతో ఫొటోలు, వీడియోలు తీశారు. వాళ్లు వీడియోలు తీస్తున్నారన్న విషయం తెలిసినా కానీ ఆ జంట.. సుఖం నుంచి బయటకు రాలేదు. వాళ్ల పని కానిచ్చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సెప్టెంబర్ 14 న ట్విట్టర్‌లో షేర్ చేశారు నెటిజన్. ఆ దంపతులు ఒకరి బట్టలు ఒకరు తీసేసుకున్నారు.. మరియు వారిని ఆపడానికి ఎవరూ రాలేదంటూ క్యాప్షన్ పెట్టి.. ఈ వీడియోను ఆన్‌లైన్‌లో పోస్ట్ చేశాడు. అంతేకాదు ఈ సంఘటన రేనర్ ఎయిర్‌లైన్‌కు సంబంధించిన విమానంలో జరిగిదంటూ కూడా తెలియజేశారు.

  Acidity Prevention: ఎసిడిటీతో బాధపడుతున్నారా..? అయితే ఈ చిట్కాలు పాటిస్తే క్షణాల్లో మాయం..


  ఈ వీడియో చూసిన చాలామంది ఇక ఆ విమానాల్లో ప్రయాణించడానికి ఆలోచిస్తున్నారు. ఈ వీడియోను షేర్ చేసిన గంటల వ్యవధిలోనే లక్షల్లో వ్యూస్ వచ్చాయి. అయితే, ఇప్పటివరకు ఆ ఎయిర్‌లైన్స్ ఈ సంఘటనపై స్పందించలేదు. ‘తమ నియమాలను ఎవరైనా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని.. అంతేకాకుండా అలా ప్రవర్తించిన వ్యక్తిని ఇక తమ సంస్థకు సంబంధించి ఎలాంటి విమానంలో కూడా ప్రయాణం చేయడానికి వీలు లేకుండా చర్యలు తీసుకుంటామని’ వాళ్ల నిబంధనల్లో స్ఫష్టంగా రాసి ఉంది.

  అయినా ఆ సంస్థ ప్రతినిధులు దీనిపై స్పందించలేదు. ఇతర ఐరిష్ కంపెనీల కంటే ర్యానయిర్ ఎయిర్‌లైన్ టిక్కెట్లు చౌకగా ఉంటాయి. ఈ కారణంగా సాధారణ ప్రజలు ఈ ఎయిర్‌లైన్‌లో ప్రయాణించడానికి ఇష్టపడతారు. కానీ ఈ వీడియో వైరల్ అయిన తర్వాత ఈ సంస్థకు సంబంధించి విమానాల్లో ప్రయాణించడానికి ఎవరూ ఆసక్తి కనబర్చడం లేదని తెలుస్తోంది.
  Published by:Veera Babu
  First published: