ఘోర విషాదం.. యూరియా కోసం లైన్లో నిలబడి రైతు మృతి..

యూరియా కోసం క్యూలో నిలబడి గుండెపోటుతో మృతి చెందాడో రైతు. ఈ విషాద ఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాకలో చోటు చేసుకుంది. మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ కేంద్రం దగ్గర యూరియా కోసం క్యూలో నిలబడిన రైతు ఎల్లయ్య (65) ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: September 5, 2019, 2:19 PM IST
ఘోర విషాదం.. యూరియా కోసం లైన్లో నిలబడి రైతు మృతి..
ఎరువుల కోసం నిజామాబాద్‌లో క్యూ లైన్లో నిల్చున్న రైతులు (ఫైల్)
  • Share this:
యూరియా కోసం క్యూలో నిలబడి గుండెపోటుతో మృతి చెందాడో రైతు. ఈ విషాద ఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాకలో చోటు చేసుకుంది. మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ కేంద్రం దగ్గర యూరియా కోసం క్యూలో నిలబడిన రైతు ఎల్లయ్య (65) ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే ఎల్లయ్యను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడు దుబ్బాక మండలం అచ్చుమాయపల్లికి చెందినవాడు. రెండు రోజులుగా ఎల్లయ్య క్యూలోనే నిలబడ్డాడని, యూరియా కోసం అన్నదాతలు పడుతున్న కష్టానికి ఈ ఘటన అద్దం పట్టిందని రైతులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి యూరియా అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

మరోవైపు, యూరియా కొరత ఆందోళనకరంగా మారుతోంది. ఎరువు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఫర్టిలైజర్స్ దుకాణాల వద్ద బారులు తీరుతున్నారు. ఈ క్రమంలో కొందరు అస్వస్థతకు గురవుతున్నారు. మరికొందరు మ‌ృత్యువాతపడుతున్నారు. అటు.. వ్యవసాయశాఖ అధికారులు మాత్రం రాష్ట్రంలో యూరియా కొరత లేదని అంటున్నారు. ఇదిలా ఉండగా, యూరియా సమస్య రాజకీయ వివాదంగా మారింది. ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నాయి.
First published: September 5, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading