వివాహిత వికృత చేష్టలు. మైనర్ బాలికపై కృత్రిమ లైంగిక సాధనాలతో..

దర్యాప్తులో భాగంగా ఏడుకొండలు-సుమలత ఇంటిని తనిఖీ చేశారు. ఇంట్లో కొన్ని కృత్రిమ లైంగిక సాధనాలు,కృత్రిమ జననాంగాలు బయటపడ్డాయి.

news18-telugu
Updated: November 8, 2019, 8:26 AM IST
వివాహిత వికృత చేష్టలు. మైనర్ బాలికపై కృత్రిమ లైంగిక సాధనాలతో..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఒంగోలు జిల్లా గోనుగుంటలో వెలుగుచూసిన మైనర్‌పై రేప్ వ్యవహారంలో విస్తుపోయే విషయాలు వెలుగుచూస్తున్నాయి. మైనర్‌ బాలికను రేప్ చేసింది సుమలత అనే వివాహిత అనిపోలీసులు నిర్దారణకు వచ్చారు. సుమలత వ్యవహారాన్ని జీర్ణించుకోలేక ఆమె భర్త భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.సుమలత ఇంటికెళ్లి తనిఖీ చేసిన పోలీసులకు నివ్వెరపోయే విషయాలు తెలిశాయి.

వివరాల్లోకి వెళ్తే.. గోనుగుంటలో ఆర్ఎంపీగా పనిచేస్తున్న ఏడుకొండలు, అదే గ్రామానికి చెందిన సుమలత ఏడేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. అంతకుముందు సుమలతకు రెండు వివాహలయ్యాయి. ఏడుకొండలు కూడా అంతకుముందు మరో వివాహం చేసుకుని విడాకులు తీసుకున్నాడు. సుమలతను పెళ్లి చేసుకున్న తర్వాత మారుతీనగర్‌లో నివాసం ఉండేవాడు. వివాహమై చాలా ఏళ్లు అయిన వీరికి పిల్లలు కలగలేదు. ఇదే క్రమంలో ఇటీవల గోనుగుంటకు చెందిన ఓ బాలిక ఏడుకొండలు,సుమలత దంపతులు తనపై అత్యాచారానికి పాల్పడ్డారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

దర్యాప్తులో భాగంగా ఏడుకొండలు-సుమలత ఇంటిని తనిఖీ చేశారు. ఇంట్లో కొన్ని కృత్రిమ లైంగిక సాధనాలు,కృత్రిమ జననాంగాలు బయటపడ్డాయి. అవన్నీ సుమలతే కొనుగోలు చేసినట్టు తేలింది. వాటితోనే బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్టు గుర్తించారు. మగవాళ్లలా ఉండటానికి ఇష్టపడే సుమలత.. మహిళలను ఆకర్షించడానికి ప్రయత్నించేది. ఆమె ఇంట్లో దొరికిన కొన్ని ప్రేమ లేఖలే ఇందుకు సాక్ష్యం అంటున్నారు పోలీసులు. మగవాళ్ల పేరుతో ఆడవారికి ప్రేమ లేఖలు రాసి వారిని ఆకర్షించేది. ఇదే క్రమంలో మైనర్ బాలికను కూడా ఆకర్షించి ఆమెపై లైంగిక దాడికి పాల్పడింది. సుమలత గురించి నివ్వెరపోయే విషయాలు తెలియడంతో.. భర్త ఏడుకొండలు భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సుమలత వ్యవహారంపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు మొదలుపెట్టారు. సుమలత లెస్సియనా?(స్వలింగ సంపర్కురాలు), లేక వికృత లైంగిక చేష్టలతో సంతృప్తి పొందడానికే ఇలా చేసేదా? అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గతంలో ఆమె ఇంకెంతమందిపై ఇలా లైంగిక దాడులకు పాల్పడిందో విచారిస్తున్నారు.
First published: November 8, 2019, 7:49 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading