600 మంది అమ్మాయిలతో ఫేస్‌బుక్ ఫ్రెండ్‌షిప్... సైకో కిల్లర్ శ్రీనివాస్‌రెడ్డి బాగోతాలు...

శ్రీనివాస్‌రెడ్డి ఫేస్‌బుక్ ఖాతాలో 631 మంది స్నేహితుల్లో 600 మందికి పైగా అమ్మాయిలే.... కనిపించిన అమ్మాయికల్లా ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తూ.. వారితో స్నేహం చేయడానికి ప్రయత్నించే శ్రీనివాస్‌రెడ్డి...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: May 2, 2019, 9:19 PM IST
600 మంది అమ్మాయిలతో ఫేస్‌బుక్ ఫ్రెండ్‌షిప్... సైకో కిల్లర్ శ్రీనివాస్‌రెడ్డి బాగోతాలు...
600 మంది అమ్మాయిలతో ఫ్రెండ్‌షిప్... సీరియల్ కిల్లర్ శ్రీనివాస్‌రెడ్డి బాగోతాలు...
  • Share this:
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేసిన హాజీపూర్ సీరియల్ కిల్లర్ శ్రీనివాస్‌రెడ్డి బాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. రోడ్డుపై నిల్చున్న ఒంటరి మహిళలను టార్గెట్ చేసి, వారి లిఫ్ట్ ఇచ్చి తీసుకెళ్లి హత్యాచారానికి ఒడిగడుతున్న శ్రీనివాస్ రెడ్డి ఉదంతం దేశవ్యాపత్తంగా తీవ్ర కలకలం క్రియేట్ చేసింది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని బొమ్మలరామారం హాజీపూర్‌లో ముగ్గురు బాలికలను కిడ్నాప్ చేసి, అతికిరాతకంగా అత్యాచారం చేసి చంపేసి... పాడుబడిన బావిలో పాతిపెడుతున్న సైకో శ్రీనివాస్‌రెడ్డిని పోలీసులు కొన్నిరోజుల కిందట అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అతను చేసిన అఘాయిత్యాలను ఒక్కొక్కటిగా బయటికి లాగుతున్న పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలుస్తున్నాయి. సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ను ఎక్కువగా ఉపయోగించే శ్రీనివాస్‌రెడ్డి ఖాతాలో 631 మంది స్నేహితులు ఉన్నారు. వీరిలో 600 మందికి పైగా అమ్మాయిలే కావడం విశేషం. కనిపించిన అమ్మాయికల్లా ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తూ.. వారితో స్నేహం చేయడానికి ప్రయత్నించేవాడు శ్రీనివాస్‌రెడ్డి. ఫ్రెండ్లీగా నటిస్తూ సాన్నిహిత్యం పెంచుకుని, ఆ తర్వాత వారిలో లోబర్చుకునేందుకు ప్రయత్నించేవాడు.

శ్రీనివాస్‌రెడ్డి ఫేస్‌బుక్ ఖాతా ఓపెన్ చేసిన పోలీసులకు, అతని మెసేజ్‌లు, ఛాట్ హిస్టరీ చూసి దిమ్మతిరిగినంత పనైంది. ఫేస్‌బుక్ పరిచయంతో అమ్మాయిలను తరుచూ కలుద్దామని ఫోర్స్ చేసిన శ్రీనివాస్‌రెడ్డి, ఎవ్వరైనా కలిశాడా? కలిస్తే వారిని ఏం చేశాడు? వారిని కూడా ఇలాగే అత్యాచారం చేసి చంపేశాడా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. లిఫ్ట్ మెకానిక్‌గా పనిచేసే శ్రీనివాస్‌రెడ్డి... కర్నూలు జిల్లాలో ఓ యువతిని హత్య చేసి పీపాలో కుక్కినట్టు విచారణలో తేలింది. హాజీపూర్ నుంచి తరుచూగా వేములవాడ వెళ్లే శ్రీనివాస్‌రెడ్డి... వెళ్లేదారిలో నిజామాబాద్, కరీంనగర్, తదితర ఏరియాల్లో అమ్మాయిలను ఏమైనా చేసి ఉంటాడా? అనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. ఈ ఏరియాల్లో అదృశ్యమైన బాలికల, యువతుల వివరాలను సేకరిస్తున్నారు. ప్రస్తుతం వరంగల్ సెంట్రల్ జైలులో రిమాండులో ఉన్న శ్రీనివాస్‌రెడ్డి... ముగ్గురు బాలికలతో పాటు ఓ వేశ్య హత్య కేసులో నిందితుడిగా తేలిన సంగతి తెలిసిందే.

First published: May 2, 2019, 9:19 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading