SHOCKING FACTS REVEALED ABOUT AN ACCUSED IN A MURDER CASE IN MAHBUB NAGAR MS
మహా కీచకుడు.. ఒకరు కాదు,ఇద్దరు కాదు, ఏడుగురు మహిళల్ని..
ప్రతీకాత్మక చిత్రం
డోకూర్లోని కల్లు కాంపౌండ్లో నిత్యం మద్యం సేవించే సదరు నిందితుడు.. అక్కడ కల్లు తాగేందుకు వచ్చే మహిళలతో మాట కలిపేవాడు. ఆపై వారిని తనతో తీసుకెళ్లి.. నిర్మానుష్య ప్రాంతంలో అత్యాచారం చేసి హత్య చేసేవాడు.
ఓ మహిళ హత్య కేసులో నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులకు దిమ్మతిరిగే వాస్తవాలు తెలిశాయి. గతంలో అతను మరో ఏడుగురు మహిళలను అత్యాచారం చేసి హత్య చేసినట్టుగా గుర్తించారు. మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలం డోకూర్ గ్రామంలో ఈ ఘటన వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే.. ఈ నెల 17వ తేదీ మంగళవారం డోకూర్ గ్రామ శివారులోని పంట పొలాల్లో ఒక మహిళ మృతదేహం లభ్యమైంది. అత్యాచారం చేసి హతమార్చినట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు. అంతేకాదు,గతంలో జరిగిన ఏడు హత్యలతో అతనికి సంబంధం ఉన్నట్టు గుర్తించారు.
డోకూర్లోని కల్లు కాంపౌండ్లో నిత్యం మద్యం సేవించే సదరు నిందితుడు.. అక్కడ కల్లు తాగేందుకు వచ్చే మహిళలతో మాట కలిపేవాడు. ఆపై వారిని తనతో తీసుకెళ్లి.. నిర్మానుష్య ప్రాంతంలో అత్యాచారం చేసి హత్య చేసేవాడు.అలా అతని చేతిలో ఇప్పటివరకు ఏడుగురు మహిళలు బలయ్యారు. దీనిపై దర్యాప్తు సాగిస్తున్న పోలీసులు.. ఈ నేరాలన్నీ ఒక్కడే చేశాడా..? లేక అతనితో పాటు మరెవరైనా ఉన్నారా? అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు.