Home /News /crime /

SHOCKING FACTS REVEAL ABOUT DISHA CASE ACCUSED SB

9మందిని చంపేశారు... దిశ కేసులో బయటపడుతున్న సంచలన నిజాలు

దిశా హత్య కేసు నిందితులు

దిశా హత్య కేసు నిందితులు

ఈ హత్యలన్నీ మహబూబ్‌నగర్, సంగారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్, కర్ణాటక ప్రాంతాల్లోని హైవే ప్రాంతాల వద్ద చేసినట్లు నిందితులు అంగీకరించారని తెలిసింది.

    దిశ హత్యాచారం ఘటనలో నిందితులకు సంబంధించిన సంచలన విషయాలు బయటపడుతున్నాయి. దిశ ఒక్కటే కాదు.. ఆమె తరహాలోనే మరో 9 మంది మహిళల్ని నిందితులు హతమార్చినట్లు పోలీసులు చెబుతున్నారు. మహిళలపై కన్నేయడం, వారిపై అత్యాచారం చేయడం అనంతరం చంపేసి మృతదేహాల్ని కాల్చేయడం లాంటి నేరాలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. దీంతో హైవేలపై జరిగిన నేరాల చిట్టాను బయటకు లాగుతున్నారు. నిందితుల డీఎన్ఏ ఆధారంగా మిస్టరీ హత్యల్ని చేధించే పనిలో పడ్డారు పోలీసులు. ఇప్పటికే దీనిపై విచారణ చేపట్టేందుకు నాలుగు ప్రత్యేక టీంలు రంగంలోకి దిగాయి.

    ఇప్పటివరకు హైవేలపై ఇలాంటి 15 హత్యలు జరిగినట్లు గుర్తించారు. దిశ కేసులో ప్రధాన నిందితుడు ఆరిఫ్ అలీ కరడగుట్టిన నేరస్తుడని పోలీసులకు స్పష్టమైనట్లు సమాచారం. ఆ ఒక్కడే ఆరు హత్యలు చేసినట్లు పోలీసుల వద్ద అంగీకరించినట్లు సమాచారం. ఆ తర్వాత చెన్నకేశవులు కూడా మూడు హత్యలు చేసినట్లు ఒప్పుకొన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ హత్యలన్నీ మహబూబ్‌నగర్, సంగారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్, కర్ణాటక ప్రాంతాల్లోని హైవే ప్రాంతాల వద్ద చేసినట్లు నిందితులు అంగీకరించారని తెలిసింది.

    దిశ నిందితులు ఆరిఫ్ అలీ, చెన్నకేశవులు, నవీన్, శివల వ్యవహారం గమనిస్తే అత్యంత దారుణమైన నేరచరిత్ర ఉందని స్పష్టమవుతోంది. దిశపై కిరాతకంగా లైంగికదాడి జరిపి...దహనం చేసిన నలుగురు నిందితుల ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అనంతరం వీరు చటాన్ పల్లి వద్ద పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో నలుగురు హతమైన విషయం తెలిసిందే.
    Published by:Sulthana Begum Shaik
    First published:

    Tags: Disha murder case, Shadnagar encounter, Shadnagar rape

    తదుపరి వార్తలు