Home /News /crime /

SHOCKING FACTS BEHIND MADANAPALLI DOUBLE MURDER CASE AND POLICE QUESTIONING PURUSHOTHAM AND PADMAJA PRN

Madanapalli double murder case: అలేఖ్య చెవిలో శంఖం ఊదిన మాంత్రికుడెవరు..? మదనపల్లె జంట హత్యల కేసులో షాకింగ్ నిజాలు..,

అలేఖ్య (ఫేస్ బుక్ ఫొటోలు)

అలేఖ్య (ఫేస్ బుక్ ఫొటోలు)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) చిత్తూరు జిల్లా (Chittoor District) మదనపల్లెలో (Madanapalli Double Murder case) జరిగిన జంట హత్యల కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మూఢభక్తితో కన్నకూతుళ్లను బలితీసుకున్న తల్లిదండ్రులను ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు.

ఇంకా చదవండి ...
    ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా మదనపల్లెలో జరిగిన జంట హత్యల కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మూఢభక్తితో కన్నకూతుళ్లను బలితీసుకున్న తల్లిదండ్రులను ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు. పురుషోత్తం నాయుడు, పద్మజను విచారిస్తున్న కొద్దీ సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. అసలు కుటుంబం మొత్తాన్ని ట్రాన్స్ లోకి తీసుకెళ్లింది పెద్దకుమార్తె అలేఖ్యగా తెలుస్తోంది. మరోవైపు ఈ కేసులో మాంత్రికుడు సుబ్బరామయ్య పాత్ర కీలకంగా మారింది. హత్య జరగడానికి ముందు సుబ్బరామయ్య.., పురుషోత్తంనాయుడు నివాసానికి వెళ్లినట్లు విచారణలో తేలింది. దీంతో సుబ్బరామయ్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడ్ని ప్రశ్నిస్తున్నారు. తాను ఈనేల 23న పురుషోత్తం నాయుడు ఇంటికి వెళ్లానని..,అలేఖ్య, సాయి దివ్యకు తాయత్తులు, రుద్రాక్షలు కట్టడానికి తనను పిలిచారని చెప్పాడు.

    వాళ్లెవరు..?
    తాను ఇంటికి వెళ్లిన సమయంలో ఓ వ్యక్తి అలేఖ్య చెవిలో శంకం ఊదుతున్నట్లు రామసుబ్బయ్య పోలీసులకు వివరించాడు. ఆ వ్యక్తి ఎవరు అనేదానిపై పోలీసులు ఆరాతీస్తున్నారు. అలాగే విచారణలో సుబ్బరామయ్య.. భాస్కర్, రాజు అనే వ్యక్తుల పేర్లు కూడా చెప్పినట్లు తెలుస్తోంది. హత్యలు జరిగిన తర్వాత వాళ్లిద్దరూ కనిపించకపోవడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. హత్యలు జరిగే సమయంలో పురుషోత్తంనాయుడు, పద్మజతో పాటు మూడో వ్యక్తి ఉన్నట్లు తొలి నుంచి పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పుడు రామసుబ్బయ్య ముగ్గురి పేర్లు బయటపెట్టడంతో ఈ ముగ్గుర్లో ఒకరు కచ్చితంగా ఆ సమయంలో ఇంట్లోనే ఉండిఉంటారని భావిస్తున్నారు.

    రుయా ఆస్పత్రికి తరలింపు
    హత్యల కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న పద్మజ, పరుషోత్తంలను పోలీసులు రుయా ఆస్పత్రికి తరలించారు. మదనపల్లి సబ్ జైలు నుంచి పటిష్ట భద్రత మధ్య రుయాకు తరలించారు. పురుషోత్తం నాయుడు మానసిక స్థితి సరిగానే ఉన్నా.. పద్మజ మాత్రం మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లు వైద్యులు తేల్చారు. దీంతో ఆమెకు రుయాలో చికిత్స చేయించాలని వైద్యులు నివేదిక ఇచ్చారు.

    అందిరితోపాటే ఉంటా..
    మరోవైపు జైలులో తనను ఒంటరిగా ఉంచొద్దని.. అందరితో కలిసే ఉంటానని పద్మజ పోలీసులను కోరినట్లు తెలుస్తోంది. తాను ఎవర్నీ ఇబ్బంది పెట్టనని హామీ ఇవ్వడంతో మహిళా ఖైదీల బ్యారక్ లోనే ఆమెను ఉంచారు. భోజనం చేసిన అనంతరం రాత్రంతా ఎవరితోనూ మాట్లాడని పద్మజ శివనామస్మరణ చేసినట్లు సమాచారం. అనంతరం ఆమెను ప్రత్యేక బ్యారక్ కు మార్చి అదనంగా సిబ్బందిని నియమించినట్లు తెలుస్తోంది.

    అలేఖ్య వల్లేనా..?
    ఈ దారుణాలు జరగడానికి ప్రధాన కారణం అలేఖ్యగా పోలీసులు అనుమానిస్తున్నారు. విచారణలో వెల్లడైన అంశాలను బట్టి.. తాను చనిపోయిన పెంపుడు కుక్కను బ్రతికించానని.., దెయ్యం పట్టిన సాయి దివ్యను కూడా చంపేస్తే తిరిగి బ్రతికిస్తానని చెప్పింది. దీంతోనే పద్మజ సాయి దివ్యను డంబెల్ కొట్టి హతమార్చినట్లు తెలుస్తోంది. సాయి దివ్యను చంపిన అనంతరం.., రాగిచెంబును నోట్లో పెట్టుకొన్న అలేఖ్య.. తనను కూడా డంబెల్ తో కొట్టి చంపాలని తల్లిని కోరినట్లు పోలీసులు భావిస్తున్నారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Andhra pradesh news, Chittoor, Crime, Crime news, Murders, Tirupati

    తదుపరి వార్తలు