ప్రభుత్వాస్పత్రిలో దారుణం.. శవాన్ని పీక్కుతిన్న కుక్క.. షాకింగ్ వీడియో

ప్రభుత్వాలు మారుతున్నా.. సంవత్సరాలు గడుస్తున్నా.. ప్రభుత్వాస్పత్రుల దుస్థితి మాత్రం మారడం లేదు. అక్కడ నాణ్యమైన వైద్యం అటుంచితే.. చనిపోయిన తర్వాత శవాలను కూడా పట్టించుకునే పరిస్థితి ఉండడం లేదు. తాజాగా ఓ సర్కారు ఆస్పత్రిలో సిబ్బంది నిర్లక్ష్యం కారుణంగా దారుణం చోటు చేసుకుంది.

news18-telugu
Updated: November 27, 2020, 9:15 PM IST
ప్రభుత్వాస్పత్రిలో దారుణం.. శవాన్ని పీక్కుతిన్న కుక్క.. షాకింగ్ వీడియో
శవాన్ని పీక్కు తింటున్న కుక్క
  • Share this:
ప్రభుత్వాలు మారుతున్నా.. సంవత్సరాలు గడుస్తున్నా.. ప్రభుత్వాస్పత్రుల దుస్థితి మాత్రం మారడం లేదు. అక్కడ నాణ్యమైన వైద్యం అటుంచితే.. చనిపోయిన తర్వాత శవాలను కూడా పట్టించుకునే పరిస్థితి ఉండడం లేదు. తాజాగా ఓ సర్కారు ఆస్పత్రిలో సిబ్బంది నిర్లక్ష్యం కారుణంగా దారుణం చోటు చేసుకుంది. ఓ శవాన్ని కుక్క పీక్కుతింది. ఈ దారుణం ఉత్తర్‌ ప్రదేశ్‌ రాష్ట్రంలోని సంభాల్ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివరాల ప్రకారం.. స్థానికంగా ఉండే ఓ చిన్నారి రోడ్డు ప్రమాదానికి గురి కావడంతో స్థానిక ప్రభుత్వాస్పత్రికి చికిత్స నిమిత్తం తీసుకువచ్చారు. అయితే ఆ బాలిక చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది.

ఆ చిన్నారి శవాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించే ముందు ఓ గుడ్డలో చుట్టి ఆస్పత్రిలో ఓ మూలన స్ట్రెచర్‌పై ఉంచారు. అయితే అక్కడికి వచ్చిన ఓ కుక్క ఆ శవాన్ని పీక్కుతినింది. అంత జరుగుతున్నా ఆస్పత్రి సిబ్బంది ఎవరూ పట్టించుకోలేదు. ఈ వీడియోతోను సమాజ్ వార్టీ సోషల్ మీడియాలో ఉంచింది. ఇందుకు కారణమైన వారిని శిక్షించాలని డిమాండ్ చేసింది.
ఈ ఘటనపై బాధిత చిన్నారి తల్లిదండ్రులు సైతం ఆందోళన నిర్వహించారు. అయితే ఈ విషయంపై ఆస్పత్రి అధికారులు మాట్లాడుతూ.. ఆ రోజు తమ ఆస్పత్రిలో అనేక మరణాలు చోటు చేసుకున్నాయని చెప్పారు. దీంతో సిబ్బంది పని ఒత్తిడిలో ఉండడంతో ఇలా జరిగిందన్నారు. ఆస్పత్రి పరిసరాల్లో వీధి కుక్కల సమస్య అధికంగా ఉన్నట్లు వారు చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే.. నిర్లక్ష్యం వహించి ఈ ఘటనకు బాధ్యులైన ఇద్దరు సబ్బందిని ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు.
Published by: Nikhil Kumar S
First published: November 27, 2020, 8:56 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading