స్నానం చేయనని పిల్లాడి మారాం... తండ్రి కోపంతో ట్రక్కుతో ఢీకొట్టి...

స్నానం చేయనంటూ మారాం... అడిగినవి కొని ఇస్తేనే స్నానం చేస్తానంటూ బెట్టు... చిర్రెత్తుకొచ్చిన తండ్రి...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: February 13, 2019, 7:51 AM IST
స్నానం చేయనని పిల్లాడి మారాం... తండ్రి కోపంతో ట్రక్కుతో ఢీకొట్టి...
నమూనా చిత్రం
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: February 13, 2019, 7:51 AM IST
సాధారణంగానే ఓ వయసు వచ్చేదాకా... పిల్లలు స్నానం చేసేందుకు ఇష్టపడరు. కళ్లలోకి నీళ్లు, సబ్బు పోయి మంట పెడుతుందనే, స్నానం చేయడమే ఇష్టం లేకనో... స్నానం చేయిద్దామని ఎంత ప్రయత్నించినా తప్పించుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగే ఓ కుర్రాడు కూడా స్నానం చేయనంటే చేయనని పట్టుబట్టాడు. అయితే స్నానం చేయనని మారాం చేస్తున్నాడనే కోపంతో కొడుకుని అతిదారుణంగా చంపబోయాడో కిరాతక తండ్రి. స్థానికంగా సంచలనం క్రియేట్ చేసిన ఈ సంఘటన ఫ్లోరిడాలో జరిగింది. జోసఫ్ రిల్లే అనే 45 ఏళ్ల వ్యక్తి ట్రక్ నడుపుతూ కుటుంబంతో సహా జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి 8 ఏళ్ల కొడుకు ఉన్నాడు.

తల్లి పని మీద బయటికి వెళ్లడంతో... పిల్లాడి చేత స్నానం చేయించాల్సిన బాధ్యత తండ్రి జోసఫ్‌పైన పడింది. అయితే ఎంత చెప్పినా పిల్లాడు స్నానం చేయనంటే చేయనని మొండి పట్టుబట్టాడు. గట్టిగా అడిగే సరికి కావల్సినవి కొని ఇస్తేనే స్నానం చేస్తా... అని తేల్చి చెప్పేశాడు కుర్రాడు. అయితే స్నానం చేయమంటే వినకుండా... గొంతెమ్మ కోరికలు కోరుతున్న కొడుకుపై తండ్రి జోసెఫ్‌కి చిర్రెత్తుకొచ్చింది. అంతే... లోడ్ చేసిన ట్రక్కు తీసుకొచ్చి, కొడుకుని ఢీకొట్టి చంపేయాలని ఫిక్స్ అయ్యాడు. కొడుకు కాళ్లు, చేతులు కట్టేసి రోడ్డు మధ్యలో నిల్చోబెట్టాడు. వేగంగా లోడ్ చేసిన ట్రక్కు తీసుకొచ్చి ఢీకొట్టబోయాడు. అయితే భయంతో పిల్లాడు రక్షించాలంటూ కేకలు వేయడంతో చుట్టుపక్కలవాళ్లు వచ్చి... పిల్లాడిని రక్షించారు. కొడుకును చంపబోయిన జోసఫ్‌ గురించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి అతన్ని అరెస్ట్ చేశారు.


First published: February 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...