Home /News /crime /

SHOCKING BROTHER RAPED SISTERS IN JHARKHAND ARRESTED PVN

Shocking: వీడిని ఏం చేసినా పాపం లేదు..సొంత చెల్లెళ్లపై అత్యాచారం..అడ్డొచ్చిన కన్న తల్లిని కూడా..

చెల్లెళ్లపై అన్న అత్యాచారం(ప్రతీకాత్మక చిత్రం)

చెల్లెళ్లపై అన్న అత్యాచారం(ప్రతీకాత్మక చిత్రం)

అన్న చెల్లెలి బంధం అంటే కష్ట సుఖాలని పంచుకోవడం. ఒకరికొకరు తోడు ఉండటం.  ఆనంద సమయాలని కలిసి ఆస్వాదించడం. చెల్లెల్లికి కాళ్లో ముళ్లు గుచ్చుకుంటే అన్న కళ్లల్లో నీళ్లు తిరగాలి. చెల్లికి ఏ ఆపద వచ్చినా నేనున్నా అనే ధైర్యమే అన్న. ఇదే అన్న చెల్లెలి అనుబంధం.

ఇంకా చదవండి ...
Shocking : అన్న చెల్లెలి బంధం అంటే కష్ట సుఖాలని పంచుకోవడం. ఒకరికొకరు తోడు ఉండటం.  ఆనంద సమయాలని కలిసి ఆస్వాదించడం. చెల్లెల్లికి కాళ్లో ముళ్లు గుచ్చుకుంటే అన్న కళ్లల్లో నీళ్లు తిరగాలి. చెల్లికి ఏ ఆపద వచ్చినా నేనున్నా అనే ధైర్యమే అన్న. ఇదే అన్న చెల్లెలి అనుబంధం. అయితే అలాంటి బంధానికి మచ్చ తెచ్చాడు ఓ యువకుడు. సొంత చెల్లెళ్లపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. అంతేకాకుండా,అడ్డువచ్చిన తల్లిని కూడా రేప్ చేసేందుకు యత్నించాడు. జార్ఖండ్ రాష్ట్రంలోని లోహర్​దగా జిల్లాలో ఈ దారుణ ఘటన జరిగింది.

ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొస్తున్నా..పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా చిన్నారులపై,మహిళలపై అత్యాచారాలు ఆగడం లేదు. నిత్యం దేశంలోని ఏదో మూల చిన్నారులపై,మహిళపై అకృత్యాలు జరుగుతూనే ఉన్నాయి. పసికందులను కూడా వదిలిపెట్టడం లేదు కామాంధులు. పది రోజుల పాప దగ్గర నుంచి పండు ముసలి దాకా ఆడదైతే చాలు అన్నట్లుగా కామాంధులు వ్యవహరిస్తున్నారు. అయితే తాజాగా జార్ఖండ్ రాష్ట్రంలోని లోహర్​దగా జిల్లాలో . సొంత చెల్లెళ్లపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. గత మూడేళ్లుగా మైనర్లు అయిన తన ఇద్దరి చెల్లెళ్లపై నిందితుడు అత్యాచారానికి పాల్పడేవాడని పోలీసులు తెలిపారు. ఇటీవల మరోసారి అత్యాచారానికి ప్రయత్నించగా ప్రతిఘటించిన బాధితురాళ్లు తల్లికి ఈ విషయాన్ని చెప్పారని తెలిపారు. ఈ క్రమంలో తల్లిపై కూడా అత్యాచారానికి ఆ కామాంధుడు ప్రయత్నించాడని చెప్పారు. ఈ విషయంపై స్థానిక పోలీసులకు తల్లి ఫిర్యాదు చేయడం వల్ల పోక్సో చట్టం కింద నిందితుడిపై కేసు నమోదు చేసి అరెస్ట్​ చేసినట్లు తెలిపారు.

ALSO READ బయట బోర్డోమో అలా..అందమైన అమ్మాయిలతో లోపం యవ్వారం వేరే

మరోవైపు, ముంబైలో మంగళవారం సచిన్​ షమా అనే టెంపో డ్రైవర్​.. చాక్లెట్​ ఇప్పిస్తానని ఆశచూపి ఏడేళ్ల బాలికను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లిన అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆ బాలికను అక్కడ వదిలేసి పరారయ్యాడు. బాలిక ఏడుస్తుండటం గమనించిన ఓ స్థానికుడు పోలీసులకు సమాచారం అందించాడు. బాలిక చెప్పిన వివరాల ప్రకారం కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఆధారంగా నిందితుడు సచిన్​ షమాను అరెస్ట్​ చేశారు.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Arrested, Jharkhand, Rape on minor

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు