వజ్రాల వ్యాపారంలో వేలకోట్లు సంపాదించాడు... మ‌గ‌త‌నాన్ని పెంచుకోవాల‌నుకునే ఆశతో... చివరికి...

మగతనం పెంచుకోవాలనే ఆశతో పురుషాంగానికి శస్త్ర చికిత్స చేయించుకోవాలని భావించిన బిలియనీర్... ఆ సమయంలో హార్ట్ ఎటాక్ రావడంతో ఆపరేషన్ థియేటర్‌లోనే మృత్యువాత...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 1, 2019, 12:11 PM IST
వజ్రాల వ్యాపారంలో వేలకోట్లు సంపాదించాడు... మ‌గ‌త‌నాన్ని పెంచుకోవాల‌నుకునే ఆశతో... చివరికి...
ఎహుడ్ ఆర్యే లానియాడో
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 1, 2019, 12:11 PM IST
అతను వజ్రాల వ్యాపారంలో వేల కోట్లు సంపాదించాడు. తిరుగులేని వ్యాపారవేత్త పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు. ఎంత తిన్నా తరగనంత ఆస్తి... చిటికె వేస్తే కోరినది తెచ్చి ఇచ్చే పనివారు... తన దగ్గరున్న సంపాదనను చూస్తే ఎంతటి అందగత్తె గానీ, తన ఒళ్లో వాలిపోవాల్సిందే. అయితే అవన్నీ అతనికి సంతృప్తిని ఇవ్వలేకపోయాయి. అంగం చిన్నదిగా ఉందనే వెలితి... అతని మనసును తొలిచేసింది. శస్త్ర చికిత్స ద్వారా అంగాన్ని పెంచుకోవాలని భావించాడు. చికిత్స ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనకాడలేదు. చివరికి ఆ చికిత్స జరుగుతుండగానే గుండెపోటుతో మరణించాడు. ఈ విచిత్ర గాథ ఫ్యాన్స్‌లో జరిగింది. బెల్జియం దేశంలో ఎహుడ్ ఆర్యే లానియాడో అనే 65 ఏళ్ల వ్యక్తి వజ్రాల వ్యాపారంలో కోట్లు సంపాదించాడు.

అయితే మగతనం పెంచుకోవాలనే ఆశతో పురుషాంగానికి శస్త్ర చికిత్స చేయించుకోవాలని ఫిక్స్ అయ్యాడు. అనుకుందే తగవుగా ఆ శస్త్రచికిత్స కోసం ఫ్రాన్స్ రాజధాని పారిస్‌ చేరుకున్నాడు అక్కడో ప్రైవేటు క్లినిక్‌లో శస్త్రచికిత్స జరుగుతుండగా... అతనికి గుండెపోటు వచ్చింది. అంగం సైజు పెంచేందుకు అక్కడ ఇంజక్షన్ ఇవ్వగానే అతను ఒక్కసారిగా ఆ ఒత్తిడి తట్టుకోలేక గుండెపోటుకు గురయ్యారు. డాక్టర్లు వెంటనే స్పందించి... కృత్రిమ శ్వాస అందించేందుకు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. గుండెపోటుతో ఆపరేషన్ థియేటర్ లో బెడ్ మీద ప్రాణాలు విడిచాడు ఎహుడ్ ఆర్యే. అతను మరణించిన విషయాన్ని స్వంత కంపెనీ కూడా ధృవీకరించింది. గత ఏడాది ట్యాక్స్ ఎగవేత కారణంగా బెల్జియం ప్రభుత్వం, ఎహుడ్‌ ఆర్యే లానియాడోపై దాదాపు 4 బిలియన్ యూరోలు (దాదాపు 31 వేల కోట్ల రూపాయలు) జరిమానా విధించడం విశేషం.

First published: March 29, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...