SHOCKING ANOTHER NIRBHAYA INCIDENT IN RAJASTHAN 15 YEARS OLD DIVYANG GIRL GANG RAPED SK
ఫ్లైఓవర్‌పై అపస్మారక స్థితిలో బాలిక.. ప్రైవేట్ భాగాల్లో తీవ్ర గాయాలు.. మరో నిర్భయ ఘటన
ప్రతీకాత్మకచిత్రం
Rajasthan Gang Rape: నలుగురు వ్యక్తులు ఆమెను కారులో తీసుకొచ్చి..ఫ్లైఓవర్‌పై పడేసి వెళ్లిపోయారు. ఆమె శరీరం నుంచి అప్పటికే రక్తం కారుతూ కనిపించింది. ప్రైవేట్ భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి.
దేశంలో అత్యాచార ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు కఠిన చట్టాలు తెస్తున్నా.. కోర్టులు ఉరి శిక్షలు వేస్తున్నా..పోలీసులు ఎన్కౌంటర్లు చేస్తున్నా.. కామాంధులు మారడం లేదు. ఆడవారిపై అఘాయిత్యాలు జరుపుతూనే ఉన్నారు. చిన్నపిల్లలు.. ముసలి వారని కూడా చూడకుండా దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా రాజస్థాన్ (Rajasthan)లో మరో ఘోరం జరిగింది. ఢిల్లీ నిర్భయ ఘటనను తలపిస్తూ.. మైనర్ బాలికపై దుండుగులు సామూహిక అత్యాచారం (Rajasthan Gang Rape) చేశారు. పదునైన వస్తువులతో ఆమె ప్రైవేట్ భాగాలను తీవ్రంగా గాయపరిచారు. తీవ్ర గాయాలపాలైన బాధితురాలు ప్రస్తుతం ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. అల్వార్ జిల్లాలో ఈ ఘోరం జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం రాత్రి అల్వార్ జిల్లా తిజారా ఫ్లైఓవర్‌పై ఓ బాలిక అపస్మారక స్థితిలో పడి ఉంది. నలుగురు వ్యక్తులు ఆమెను కారులో తీసుకొచ్చి..ఫ్లైఓవర్‌పై పడేసి వెళ్లిపోయారు. ఆమె శరీరం నుంచి అప్పటికే రక్తం కారుతూ కనిపించింది. ప్రైవేట్ భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. ఆ తర్వాత కాసేపటికి కొందరు వాహనదారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు చేరుకొనే సరికి.. కొందరు స్థానికులు ఆ బాలికను ఫొటోలు, వీడియోలు తీస్తూ కనిపించారు. పోలీసులు వారిని మందలించి అక్కడి నుంచి పంపించారు. అనంతరం బాలికను హుటాహుటిన జైపూర్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. బాధితురాలు షాక్‌లో ఉందని.. ఏమీ మాట్లాడలేని స్థితిలో ఉందని వైద్యులు తెలిపారు. ఆమెను సామూహికంగా అత్యాచారం చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.
మంగళవారం సాయంత్రమే స్థానిక పోలీస్ స్టేషన్లో ఓ మిస్సింగ్ కేసు (Girl Missing Case) నమోదయింది. తమ కూతురు కనిపించడం లేదు ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అదే రోజు రాత్రి ఫ్లైఓవర్‌పై అపస్మారక స్థితిలో బాలిక కనిపించడంతో.. పోలీసులు ఆమెకు సమాచారం ఇచ్చారు. అత్యాచార బాధితురాలు తమ కూతురేనని తల్లిదండ్రులు గుర్తించరు. తమ కుమార్తె పరిస్థితిని చూసి గుండెలవిసేలా రోదించారు. ఆ బాలిక మాట్లాడలేదు. చెవులు కూడా వినిపించవు. అలాంటి దివ్యాంగురాలిపై ఇంతటి ఘోరానికి పాల్పడ్డారని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు అల్వార్ జిల్లా ఎస్పీ తేజస్విని తెలిపారు. ఘటనా స్థలం చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నామని.. త్వరలోనే వారిని పట్టుకుంటామని పోలీసులు చెప్పారు. ప్రస్తుతం బాలిక ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పేర్కొన్నారు. ఐతే మైనర్ బాలిక పట్ల ఇంత అమానుషంగా ప్రవర్తించిన దుండగలను ఉరితీయాలన్న డిమాండ్లు స్థానికంగా వినిపిస్తున్నాయి.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.