మూడేళ్ల చిన్నారిపై కన్నతల్లి దారుణచర్య... పోర్న్ వీడియోలు తీసి పైశాచికంగా దాడి...

జననేంద్రియాన్ని కత్తెరతో కత్తిరించిన తల్లి... తండ్రి తెలియకుండా చిన్నారిపై పిచ్చి చేష్టలు... ఎలా గాయపడిందని డాక్టర్లు అడిగితే... యాక్సిడెంటల్‌గా కత్తి మీద పడిందంటూ బుకాయింపు... మహిళకు 11 ఏళ్ల జైలుశిక్ష విధించిన న్యాయస్థానం...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: March 12, 2019, 3:52 AM IST
మూడేళ్ల చిన్నారిపై కన్నతల్లి దారుణచర్య... పోర్న్ వీడియోలు తీసి పైశాచికంగా దాడి...
నమూనా చిత్రం
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: March 12, 2019, 3:52 AM IST
అమ్మతనానికి మచ్చ తీసుకొచ్చిన అమానుష చర్య ఇది. కంటికి రెప్పలా కూతుర్ని కాపాడాల్సిన తల్లి... కనీస విచక్షణ లేకుండా మూడేళ్ల చిన్నారిపై దారుణానికి పాల్పడిన క్రూరత్వం ఇది. బ్రిటన్ చరిత్రలోనే ఓ తల్లిపై వచ్చిన అతిదారుణమైన ఆరోపణ ఇది. ఉగాండాకు చెందిన ఓ మహిళ... తన మూడేళ్ల చిన్నారి జననేంద్రియాన్ని కత్తిరించింది. పుట్టినప్పటి నుంచి చిన్నారితో అత్యంత క్రూరంగా ప్రవర్తిస్తూ చైల్డ్ పోర్నోగ్రఫీ వీడియోలు చిత్రీకరించిన ఆమె... బాలిక ఐడెంటీటీ స్పష్టంగా కనిపించడం కోసం జననేంద్రియాన్ని కత్తెరతో కత్తిరించింది. తల్లి చేసిన ఈ దారుణ చర్య కారణంగా బాలికకు తీవ్రమైన రక్తస్రావం జరిగింది. వెంటనే బాలికను ఆసుపత్రికి తీసుకెళ్లింది. అయితే ఎలా గాయపడిందని డాక్టర్లు అడిగితే... యాక్సిడెంటల్‌గా కత్తి మీద పడిందని చెప్పింది. గాయం జరిగిన తీరు చూసి అనుమానం వచ్చిన వైద్యులు... చికిత్స ప్రారంభించి పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు... విచారణ చేయగా తల్లి ఆకృత్యాలు వెలుగులోకి వచ్చాయి.

అయితే తాను చిన్నారి జననాంగాన్ని కత్తిరించినట్టు అంగీకరించినట్టు ఒప్పుకున్న సదరు తల్లి... అందుకు ఎటువంటి ప్రశ్చాతాపం పడడం లేదని స్పష్టం చేసింది. 2017 ఆగస్టులో జరిగిన ఓ ప్రమాదంలో చిన్నారి గాయపడిందని... ఆ గాయం తగ్గించేందుకే ఈ విధంగా చేసినట్టు చెప్పుకొచ్చింది. అయితే పోలీసుల విచారణలో అలాంటిదేమీ లేదని తేలింది. చిన్నారి ఎలాంటి గాయం కాలేదని, తల్లి కావాలనే కూతురిపై అమానుష చర్యకు పాల్పడిందని తేల్చారు లండన్ సెంట్రల్ క్రిమినల్ కోర్ట్. 43 ఏళ్ల బాలిక తండ్రికి భార్య చేస్తున్న పిచ్చి పనులేవీ తెలియకపోవడం విశేషం. భర్త ఆపీసుకు వెళ్లిన తర్వాత చిన్నారిని చూసుకునే తల్లి... పసిబిడ్డతో పైశాచికంగా వ్యవహారించేదని విచారణలో తేలింది. మాతృత్వానికి మచ్ఛ తీసుకొచ్చిన సదరు 37 ఏళ్ల మహిళకు 11 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది బ్రిటన్ కోర్టు.

First published: March 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...