ఏడో క్లాస్ విద్యార్థినిపై 62 ఏళ్ల ముసలోడి అఘాయిత్యం... దగ్గరకు తీసుకుని...

ట్యూషన్‌కు వచ్చిన ఏడో తరగతి బాలికపై మాజీ ఉపాధ్యాయుడి దారుణ చర్య... ఒంటరిగా ఉన్న చిన్నారికి లైంగిక వేధింపులు...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: March 30, 2019, 6:45 PM IST
ఏడో క్లాస్ విద్యార్థినిపై 62 ఏళ్ల ముసలోడి అఘాయిత్యం... దగ్గరకు తీసుకుని...
ఏడో క్లాస్ విద్యార్థిపై 62 ఏళ్ల ముసలోడి అఘాయిత్యం... క్లాస్‌రూమ్‌లోనే దగ్గరకు తీసుకుని...
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: March 30, 2019, 6:45 PM IST
విద్యార్థులకు బయటే కాదు... బడిలో కూడా రక్షణ లేకుండా పోయింది. తాజాగా గుజరాత్ రాష్ట్రంలో సూరత్ నగరంలో తరగతి గదిలో ఓ ఏడో తరగతి విద్యార్థినిపై అత్యంత దారుణంగా లైంగికదాడికి ఒడిగట్టాడు 62 ఏళ్ల మాజీ ఉపాధ్యాయుడు. సూరత్ సమీపంలోని నవదీప్ గోల్వాడా ఏరియాలో నివాసం ఉంటున్న జగదీశ్ రాజ్‌పుత్...తన 12 ఏళ్ల కుమార్తెను దగ్గర్లోని కోట్‌సర్ స్కూల్‌లో చదివిస్తున్నాడు. ఏడో తరగతి చదువుతున్న ఆమె...గురువారం స్కూల్‌ నుంచి ఏదో దిగులుతో ఉన్నట్టు కనిపించింది. అనుమానం వచ్చిన బాలిక తల్లి, ఏమైందని అడిగింది. స్కూల్ అయిపోగానే పక్కనే ఉంటున్న 62 ఏళ్ల ఓ మాజీ ఉపాధ్యాయుడు ప్రవీణ్ చంద్ర ఇంటికి సాయంత్రం ట్యూషన్ వెళ్లేది బాలిక. ఎప్పటిలాగే ట్యూషన్‌కు వెళ్లిన బాలికపై మాజీ ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులకి పాల్పడ్డాడని చెప్పాగానే తల్లి షాక్‌కు గురైంది. భార్యతో పాటు నివాసం ఉంటున్న వ‌ృద్ధుడు... కిచెన్‌లో నీళ్లు, ఆహారం కిందపడేసి క్లాస్‌కు వచ్చాడు.

ఆ తర్వాత ఒంటరిగా ఉన్న విద్యార్థిని గట్టిగా కౌగిలించుకుని, గట్టిగా ముద్దు పెట్టుకున్నాడని చెప్పి తల్లికి చెప్పి ఏడవడం మొదలెట్టింది బాలిక. తర్వాతి రోజు ఉదయం కూతురితో కలిసి ప్రవీణ్ చంద్ర ఇంటికి వెళ్లిన బాలిక తల్లి... లైంగిక వేధింపుల గురించి నిలదీసింది. దానికి అతను తన మనవరాలిగా భావించి, ముద్దుగా అలా చేశానని చెప్పాడు. అయితే ఆ సమాధానంతో సంతృప్తి చెందని ఆమె... బంధువులుతో కలిసి అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదుచేసుకున్న పోలీసులు... వృద్ధుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

First published: March 30, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...