హోమ్ /వార్తలు /క్రైమ్ /

Boat capsizes : ఘోర ప్రమాదం..పడవ బోల్తా పడి 77 మంది మృతి

Boat capsizes : ఘోర ప్రమాదం..పడవ బోల్తా పడి 77 మంది మృతి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

77 Migrants Dead : తూర్పు మధ్యధరా సముద్రంలో జరిగిన ఘోరమైన పడవ ప్రమాదాలలో ఇదొకటి. ఏప్రిల్‌లో కూడా ఇలాంటి ఘటనే జరిగి చాలామంది మరణించారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Boat capsizes : సిరియా(Syria) తీరంలో ఘోర ప్రమాదం జరిగింది. దాదాపు 150 మంది అక్రమ వలసదారులతో లెబనాన్(Lebanon)​ నుంచి ఐరోపాకు వెళ్తున్న పడవ గురువారం మధ్యాహ్నం సిరియా తీరంలో బోల్తా పడింది(Boat capsizes). ఈ ఘటనలో 77 మంది వలసదారులు మరణించినట్లు సిరియా ఆరోగ్య మంత్రి శుక్రవారం చెప్పారు. సిరియాలోని టార్టస్ నగరం సమీపంలో బోల్తా పడిన చిన్న పడవలో దాదాపు 150 మంది, ఎక్కువగా లెబనీస్ మరియు సిరియన్లు ఉన్నారని తెలిపారు.తూర్పు మధ్యధరా సముద్రంలో జరిగిన ఘోరమైన పడవ ప్రమాదాలలో ఇదొకటని తెలిపారు. నీట మునిగిన కొన్ని మృతదేహాలను వెలికితీశామని, 20 మందిని రక్షించి చికిత్స కోసం తీరప్రాంత నగరమైన టార్టస్‌లోని హాస్పిటల్ కు తరలించారని సిరియన్ పోర్ట్ అథారిటీ అధిపతి జనరల్ సమీర్ కోబ్రోస్లీని తెలిపారు. అదే సమయంలో సిరియన్ ద్వీపం అర్వాద్ సమీపంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని, బాధితుల కోసం అధికారులు వెతుకుతున్నారని ఆయన చెప్పారు.

బోటు మనిగిపోయి 77మంది మరణించగా, 20 మంది ప్రాణాలతో బయటపడి చికిత్స పొందుతున్నారని, ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉంద ని సిరియా ఆరోగ్య మంత్రి హసన్ అల్-గబాష్ టార్టస్‌ లోని అల్-బాసెల్ ఆసుపత్రి నుండి చేసిన టెలివిజన్ ప్రసంగంలో తెలిపారు. రక్షించబడిన వారిలో ఐదుగురు లెబనీస్ ఉన్నారని లెబనాన్ కేర్ టేకర్ రవాణా మంత్రి అలీ హమీ తెలిపారు. కాగా,టార్టస్.. సిరియా యొక్క ప్రధాన నౌకాశ్రయాలకు దక్షిణాన ఉంది. వలసదారులు పడవ ఎక్కిన నార్త్ లెబనీస్ ఓడరేవు నగరమైన ట్రిపోలీకి ఉత్తరాన 50 కిలోమీటర్లు (30 మైళ్ళు) దూరంలో ఉంది.

రిసార్ట్ లోని రిసెప్షనిస్ట్ ని దారుణంగా హత్య చేసిన మాజీ మంత్రి కుమారుడు అరెస్ట్!

2019 నుండి తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న లెబనాన్..అక్రమ వలసలకు లాంచ్‌ప్యాడ్‌గా మారింది. లెబనాన్ పౌరులు సిరియన్, పాలస్తీనా శరణార్థులతో కలిసి తమ మాతృభూమిని విడిచిపెట్టే ప్రయత్నాలు తీవ్రంగా చేస్తున్నారు. ఆర్థిక సంక్షోభం కారణంగా వేలాది లెబనీస్,సిరియన్లు, పాలస్తీనియన్లు లెబనాన్ నుండి సముద్రం ద్వారా ఐరోపాకు వలస వెళ్తున్నారు. బతుకుదెరువు కోసం వలస వెళ్తుంటే ఇలాంటి ఘోరమైన ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. ఏప్రిల్‌లో కూడా ఇలాంటి ఘటనే జరిగి చాలామంది మరణించారు.

Published by:Venkaiah Naidu
First published:

Tags: Boat accident, Boat capsizes

ఉత్తమ కథలు